స్టార్ హెల్త్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ

*I consent to be contacted by Star Health Insurance for health insurance product inquiries, overriding my NCPR/DND registration.

IRDAI UIN: SHAHLIP20046V011920

HIGHLIGHTS

Plan Essentials

essentials

అందించబడుతున్న ప్లాన్‌లు

ఈ పాలసీ ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ప్రాథమిక మరియు మెరుగైన ప్లాన్ ఎంపికలను అందిస్తుంది.
essentials

పాలసీ టర్మ్

ఈ పాలసీని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల కాలానికి పొందవచ్చు.
essentials

పాలసీ రకం

ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చు.
essentials

ప్రవేశ వయస్సు

18 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని పొందవచ్చు. ఫ్లోటర్ ప్రాతిపదికన, గరిష్టంగా 91 రోజుల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆధారపడే ముగ్గురు పిల్లలకు కవరేజీ వర్తిస్తుంది.
essentials

హాస్పిటల్ క్యాష్ రోజులు

హాస్పిటల్ క్యాష్ రోజుల సంఖ్య బేసిక్ ప్లాన్ కింద 30 నుండి 180 రోజుల వరకు మరియు ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్ కింద 90 నుండి 180 రోజుల వరకు ఉంటుంది.
essentials

డే కేర్ ప్రక్రియలు

పాలసీ నిబంధనలో పేర్కొన్న నిర్దేశిత డే కేర్ చికిత్సల కోసం అయ్యే ఖర్చులు పాలసీ సంవత్సరంలో ఐదు సార్లు కవర్ చేయబడతాయి.
essentials

హాస్పిటల్ క్యాష్ మొత్తం (రోజుకు)

బేసిక్ ప్లాన్ కింద అందుబాటులో ఉన్న రోజువారీ హాస్పిటల్ క్యాష్ మొత్తాలు రూ. 1000, 2000 మరియు 3000/-గా ఉంటాయి మరియు ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్ క్రింద రూ. 3000, 4000 మరియు 5000/-గా ఉంటాయి.
DETAILED LIST

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

ముఖ్యమైన అంశాలు

అనారోగ్య హాస్పిటల్ క్యాష్

అనారోగ్యం కారణంగా రోజువారీ హాస్పిటల్ క్యాష్ అనేది బీమా పొందిన వ్యక్తి ఎంచుకున్న గరిష్ట రోజుల వరకు హాస్పిటల్ క్యాష్ మొత్తం వరకు అందించబడుతుంది. బేసిక్ ప్లాన్ కింద, ఒక రోజు మినహాయింపు వర్తిస్తుంది.

యాక్సిడెంట్ హాస్పిటల్ క్యాష్

ప్రమాదాల కారణంగా రోజువారీ హాస్పిటల్ క్యాష్ అనేది బీమా పొందిన వ్యక్తి ఎంచుకున్న గరిష్ట రోజుల వరకు హాస్పిటల్ క్యాష్ మొత్తానికి 150% వరకు అందించబడుతుంది.

ఐసియు హాస్పిటల్ క్యాష్

అనారోగ్యం లేదా గాయం కారణంగా ICU ఖర్చుల కోసం రోజువారీ హాస్పిటల్ క్యాష్‌గా ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఎంచుకున్న హాస్పిటల్ క్యాష్ మొత్తంలో 200% వరకు అందించబడుతుంది. వ్యక్తిగత మరియు ఫ్లోటర్ పాలసీల మధ్య హాస్పిటల్ క్యాష్ రోజుల యొక్క గరిష్ట సంఖ్య మారుతూ ఉంటుంది.

కోలుకునే సమయంలో హాస్పిటల్ క్యాష్

వరుసగా 5 రోజులకు మించి ఆసుపత్రిలో చేరిన సందర్భంలో, ఒక రోజు అదనపు హాస్పిటల్ క్యాష్ మొత్తం కోలుకునే సమయంలో హాస్పిటల్ క్యాష్‌గా అందించబడుతుంది.

శిశుజనన హాస్పిటల్ క్యాష్

ఈ పాలసీ యొక్క మొదట ప్రారంభమైన దగ్గరిఉ నుండి 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత ప్రసవం కోసం రోజువారీ హాస్పిటల్ క్యాష్ ప్రయోజనాన్ని పొందేందుకు ఇన్సూరెన్స్ పొందిన మహిళలు అర్హులు.

వరల్డ్‌వైడ్ హాస్పిటల్ క్యాష్

భారతదేశం వెలుపల అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భంలో, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఎంచుకున్న గరిష్ట రోజులకు లోబడి రోజువారీ హాస్పిటల్ క్యాష్ మొత్తంలో 200% అందుకుంటారు

డే కేర్ ప్రక్రియలు

పాలసీ నిబంధనలో పేర్కొన్న నిర్దేశిత డే కేర్ చికిత్సల కోసం అయ్యే ఖర్చులు పాలసీ సంవత్సరంలో ఐదు సార్లు కవర్ చేయబడతాయి.
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

మా కస్టమర్‌లు

' సంతోషంగా బీమా చేయబడ్డాం!' స్టార్ హెల్త్‌తో

మేము మీ సమయాన్ని ఆదా చేయడానికి, మీ డబ్బును ఆదా చేయడానికి మరియు ఆరోగ్య బీమాను నావిగేట్ చేయడం కష్టతరం చేసే ఇబ్బందుల నుండి మిమ్మల్ని తప్పించడానికి కట్టుబడి ఉన్నాము.

Customer Image
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ కొనమని నా స్నేహితుడు చెప్పాడు. నా కొడుకు అనారోగ్యం సమయంలో అది నాకు సహాయం చేసింది. వారి నగదు రహిత చికిత్స సౌకర్యం ఆ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంది. వారి సేవ మరియు మద్దతును నేను నిజంగా అభినందిస్తున్నాను.

టిజి కె ఊమెన్

తిరువనంతపురం

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నేను గత 8 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్నాను. ఆ సమయంలో రెండు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసాను. రెండు క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయి. నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో కంపెనీ నుండి నాకు మంచి మద్దతు లభించింది

వాణిశ్రీ

బెంగళూరు

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నా కుటుంబం 2006 నుండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉంది. గత నెలలో మేము దరఖాస్తు చేసుకున్న మా క్లెయిమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేయబడింది. మేము అలాంటి సర్వీస్ ప్రొవైడర్లలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము.

రామచంద్రన్

చెన్నై

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నాకు అవసరమైనప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు చాలా సహాయం చేసింది. నా యాంజియోప్లాస్టీ సర్జరీ సమయంలో వారి నెట్‌వర్క్ ఆసుపత్రిలో నాకు నగదు రహిత చికిత్స అందించిన స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ కింద నేను కవర్ చేయబడ్డాను.

శైల గణాచారి

ముంబై

ఇన్సురెన్స్ పొందండి
Customer Image
నేను గత 7-8 సంవత్సరాలుగా మెడిక్లెయిమ్ సేవలను ఉపయోగిస్తున్నాను. నేను ఇతర కంపెనీలను ప్రయత్నించాను. కానీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు అందించిన సేవతో నేను సంతృప్తి చెందాను, వారి వద్ద స్నేహపూర్వక సహాయక సిబ్బంది కూడా ఉన్నారు.

సుధీర్ భాయ్జీ

ఇండోర్

ఇన్సురెన్స్ పొందండి
user
టిజి కె ఊమెన్
తిరువనంతపురం

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ కొనమని నా స్నేహితుడు చెప్పాడు. నా కొడుకు అనారోగ్యం సమయంలో అది నాకు సహాయం చేసింది. వారి నగదు రహిత చికిత్స సౌకర్యం ఆ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంది. వారి సేవ మరియు మద్దతును నేను నిజంగా అభినందిస్తున్నాను.

user
వాణిశ్రీ
బెంగళూరు

నేను గత 8 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్నాను. ఆ సమయంలో రెండు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసాను. రెండు క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయి. నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో కంపెనీ నుండి నాకు మంచి మద్దతు లభించింది

user
రామచంద్రన్
చెన్నై

నా కుటుంబం 2006 నుండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉంది. గత నెలలో మేము దరఖాస్తు చేసుకున్న మా క్లెయిమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేయబడింది. మేము అలాంటి సర్వీస్ ప్రొవైడర్లలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము.

user
శైల గణాచారి
ముంబై

నాకు అవసరమైనప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు చాలా సహాయం చేసింది. నా యాంజియోప్లాస్టీ సర్జరీ సమయంలో వారి నెట్‌వర్క్ ఆసుపత్రిలో నాకు నగదు రహిత చికిత్స అందించిన స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ కింద నేను కవర్ చేయబడ్డాను.

user
సుధీర్ భాయ్జీ
ఇండోర్

నేను గత 7-8 సంవత్సరాలుగా మెడిక్లెయిమ్ సేవలను ఉపయోగిస్తున్నాను. నేను ఇతర కంపెనీలను ప్రయత్నించాను. కానీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు అందించిన సేవతో నేను సంతృప్తి చెందాను, వారి వద్ద స్నేహపూర్వక సహాయక సిబ్బంది కూడా ఉన్నారు.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి

ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us
మరింత సమాచారం కావాలా?
Get Insured
మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?

స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ

 

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు అవి నానాటికీ పెరుగుతున్నాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. రోగ వాహకాల ద్వారా సంక్రమించే, గాలి ద్వారా మరియు నీటి ద్వారా సంక్రమించే అంటువ్యాధులు ఒక వ్యక్తి నెలవారీ పొదుపులను సులభంగా హరించివేస్తాయి. మీరు మీ ఆసుపత్రి ఖర్చులను కవర్ చేయడానికి మీ సాధారణ హెల్త్ కవరేజీని ఉపయోగించవచ్చు. కానీ మీరు ఆసుపత్రిలో చేరిన తర్వాత, అనేక ఇతర ఖర్చులు మరియు అనివార్యమైన ఖర్చులను ఎదుర్కోవచ్చు.

 

హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ ఇక్కడ కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. చిన్న విషయాలు కూడా మీ కోసం కవర్ చేయబడటం అనేది హాస్పిటల్ క్యాష్ పాలసీ యొక్క ఉత్తమ ఫీచర్లలో ఒకటి. ఈ ప్లాన్ తీసుకుంటే, మీ రోజువారీ అవసరాలకు కవరేజీ వర్తిస్తుంది. స్టార్ హాస్పిటల్ క్యాష్ పాలసీ అనేది మీ  ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు అదనపు ప్రయోజన ప్లాన్. ఆసుపత్రిలో చేరిన ప్రతి రోజుకు నిర్ణీత మొత్తంలో మీకు కవర్ చేయడానికి. ఈ చెల్లింపు మీరు ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఇతర ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, పెట్రోలు, సహాయకులకు ఆహారం, ఆసుపత్రి వెలుపల చేసే ఇతర జేబు ఖర్చులను కవర్ చేయడానికి కూడా ఈ పాలసీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు, మీ హాస్పిటల్ క్యాష్ పాలసీలో కవరేజీ రోజుకు రూ.1000 అయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీకు మీరు ఆసుపత్రిలో ఉన్న మొత్తం వ్యవధిలో ప్రతి రోజుకు రూ. 1000 చెల్లిస్తుంది. అయితే, నిధులను ఎలా ఖర్చు చేయాలనేది పూర్తిగా మీ ఇష్టం.

 

అవి మీ ప్రస్తుత మెడికల్ హెల్త్ పాలసీకు యాడ్-ఆన్‌గా కూడా బాగా పని చేస్తాయి. మీరు రోజువారీ క్యాష్ పరిమితిని మరియు పాలసీలో అందుబాటులో ఉన్న రోజుల సంఖ్యను ఎంచుకోవాలి.

 

స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఆసుపత్రిలో నిర్బంధంలో ఉన్న సమయంలో ఏదైనా లోపలి మరియు వెలుపలి ఖర్చులకు అదనంగా రోజువారీ హాస్పిటల్ క్యాష్ అందుకుంటారు. స్టార్ హెల్త్ అందించే అన్ని మెడికల్ ప్లాన్‌లకు ఈ పాలసీ యాడ్-ఆన్ కావచ్చు.

స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్లు

 

అర్హత

స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీని మీ జీవిత భాగస్వామి మరియు 3 నెలల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 3 మంది పిల్లలతో సహా 18 సంవత్సరాల మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు మరియు కుటుంబాలు కొనుగోలు చేయవచ్చు.

 

ప్రోడక్ట్ రకం

రెండు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి - ఒకటి బేసిక్ ప్లాన్ మరియు రెండవది ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్ - వ్యక్తిగత మరియు ఫ్లోటర్ ప్రాతిపదికన. బేసిక్ ప్లాన్ మరియు ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్ల క్రింద, పాలసీదారుడు రోజుకు హాస్పిటల్ క్యాష్ మొత్తాలను మరియు హాస్పిటల్ క్యాష్ రోజుల సంఖ్యను కలిపి ఎంచుకోవచ్చు. క్రింది పట్టిక హాస్పిటల్ క్యాష్ మొత్తం మరియు హాస్పిటల్ క్యాష్ రోజుల సంఖ్య యొక్క ఎంపికలను వివరిస్తుంది.

ప్లాన్ రకంహాస్పిటల్ క్యాష్ మొత్తంహాస్పిటల్ క్యాష్ రోజులం సంఖ్య
బేసిక్ ప్లాన్రూ. 1000, రూ. 2000, రూ. 300030/60/90/120/180 రోజులు
ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్రూ. 3000, రూ. 4000, రూ. 500090/120/180 రోజులు

 

పాలసీ టెర్మ్

ఇది - 1 సంవత్సరం / 2 సంవత్సరాలు / 3 సంవత్సరాలు

 

వెయిటింగ్ పిరియలు

పాలసీ ప్రారంభించిన తేదీ నుండి 30 రోజులలోపు కలిగే అనారోగ్యం కవర్ చేయబడదు. ప్రమాదం జరిగినప్పుడు మినహాయింపు ఉంటుంది. పేర్కొన్న అనారోగ్యాలు/శస్త్రచికిత్సలకు కవరేజ్ 24 నెలల తర్వాతనుండి వర్తింపులోనికి వస్తుంది. పాలసీ ప్రారంభ తేదీ నుండి 36 నెలల (బేసిక్ ప్లాన్) మరియు 24 నెలల (ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్) వెయిటింగ్ పిరియడ్ తర్వాత ముందుగా ఉన్న వ్యాధులు కవర్ చేయబడతాయి.

 

పోర్టబిలిటీ

పోర్టబిలిటీపై IRDAI మార్గదర్శకాల ప్రకారం, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి మొత్తం పాలసీని పోర్ట్ చేయడానికి ఆ ఇన్సూరెన్స్ సంస్థకు దరఖాస్తు చేయడం ద్వారా మరొక ఇన్సూరెన్స్ సంస్థకు పాలసీని పోర్ట్ చేసే సదుపాయాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కనీసం 45 రోజుల ముందు పోర్ట్ చేయవచ్చు, కానీ రెన్యూవల్ తేదీకి కంటే 60 రోజుల లోపు కాదు.

 

ఫ్రీ-లుక్ పిరియడ్

పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించడానికి పాలసీని స్వీకరించిన తేదీ నుండి 15 రోజుల ఫ్రీ లుక్ వ్యవధి అందుబాటులో ఉంటుంది. ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి పాలసీతో సంతృప్తి చెందకపోతే, నిర్ణీత వ్యవధిలోగా పాలసీని రద్దు చేసుకునే అవకాశం వారికి ఉంటుంది. అయితే, పాలసీ రెన్యూవల్‌లకు ఈ ఫీచర్ వర్తించదు.

 

స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ (బేసిక్ మరియు ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్)లో ఏమి కవర్ చేయబడింది?

 

స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి(లు) కనీసం 24 గంటల పాటు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, బీమా చేసిన వ్యక్తి ఎంచుకున్న గరిష్ట రోజుల వరకు రోజువారీ నగదు ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీ నిబంధనల ప్రకారం కింది వాటికి అయ్యే ఖర్చులను ప్లాన్ కవర్ చేస్తుంది.

 

  • అనారోగ్య హాస్పిటల్ క్యాష్ - ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఎంచుకున్న గరిష్ట రోజుల కోసం హాస్పిటల్ క్యాష్ మొత్తం (రోజుకు). బేసిక్ మరియు ఎన్‌హాన్స్‌డ్ ప్లాన్‌లు రెంటికీ వర్తిస్తుంది.

 

  • ప్రమాద హాస్పిటల్ క్యాష్ - ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఎంచుకున్న గరిష్ట రోజులకు హాస్పిటల్ క్యాష్ మొత్తంపై 150% (రోజుకు).

 

  • ఐసియు హాస్పిటల్ క్యాష్ - ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఎంచుకున్న హాస్పిటల్ క్యాష్ మొత్తంపై 200% (రోజుకు). వ్యక్తిగత ప్రాతిపదికన పాలసీ జారీ చేయబడినప్పుడు, పాలసీ సంవత్సరంలో గరిష్టంగా 30 రోజుల వరకు మాత్రమే ఐసియు హాస్పిటల్ క్యాష్ చెల్లించబడుతుంది. ఫ్లోటర్ ప్రాతిపదికన పాలసీ జారీ చేయబడినప్పుడు, పాలసీ సంవత్సరంలో గరిష్టంగా 90 రోజుల వరకు మాత్రమే ఐసియు హాస్పిటల్ క్యాష్ చెల్లించబడుతుంది.

 

  • కోలుకునే సమయంలో హాస్పిటల్ క్యాష్ - ఆసుపత్రిలో చేరడం వరుసగా 5 రోజులకు మించి ఉంటే, ఒకరోజు అదనపు హాస్పిటల్ క్యాష్ మొత్తం కోలుకునే సమయంలో క్యాష్ ప్రయోజనంగా ఇవ్వబడుతుంది. ఇది బేసిక్ ప్లాన్‌కు వర్తించదు.

 

  • శిశుజనన హాస్పిటల్ క్యాష్ - ఈ ప్రయోజనం ఈ స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీ మొదట ప్రారంభం అయిన దగ్గరి నుండి 2 సంవత్సరాల వెయిటింగ్ పిరియడ్‌కు లోబడి ఉంటుంది. ఈ ప్రయోజనానికి ఇన్సూరెన్స్ పొందిన మహిళలు మాత్రమే అర్హులు. ఇది బేసిక్ ప్లాన్‌కు వర్తించదు.

 

  • · వరల్డ్‌వైడ్ హాస్పిటల్ క్యాష్ - ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి అనారోగ్యం లేదా గాయం యొక్క చికిత్స కోసం భారతదేశం వెలుపల ఆసుపత్రిలో చేరినట్లయితే, ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఎంచుకున్న హాస్పిటల్ క్యాష్ మొత్తంపై 200% క్యాష్ (రోజుకు) చెల్లించబడుతుంది. ఇది బేసిక్ ప్లాన్‌కు వర్తించదు.

 

  • · డేకేర్ ప్రక్రియలు - పగుళ్లు (జుట్టు పగుళ్లు కాకుండా), కంటిశుక్లం, వ్యాకోచం(డైలేషన్) మరియు నివారణ, హీమోడయాలసిస్, పేరెంటరల్ కెమోథెరపీ, రేడియో థెరపీ, కరోనరీ యాంజియోగ్రఫీ, లిథోట్రిప్సీ, జనరల్ అనస్థీషియా క్రింద డిస్‌లోకేషన్ కోసం మానిప్యులేషన్, జనరల్ అనస్థీషియా క్రింద సిస్టోస్కోపీ.  పైన పేర్కొన్న 1, 2, 3 మరియు 6 అనే కవర్లు ఈ డేకేర్ చికిత్సలకు వర్తిస్తాయి. ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి పాలసీ సంవత్సరంలో కేవలం ఐదు సార్లు మాత్రమే పైన పేర్కొన్న డేకేర్ చికిత్సలకు సంబంధించి క్లెయిమ్‌కు అర్హులు.

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి హాస్పిటల్ క్యాష్ హెల్త్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?

స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం క్లెయిమ్ ఎలా నమోదు చేసుకోవాలి?

స్టార్ హెల్త్ తన కస్టమర్లందరికీ అవాంతరాలు లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. మీరు స్టార్ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు