సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

*By providing my details, I consent to receive assistance from Star Health regarding my purchases and services through any valid communication channel.

IRDAI UIN: SHAHLIP22199V062122

HIGHLIGHTS

Plan Essentials

essentials

అనుకూలమైన సమ్ ఇన్సూర్డ్

వ్యక్తిగత ప్రాతిపదికన అందుబాటులో ఉన్న సమ్ ఇన్సూర్డ్ ఎంపికలు - 1/2/3/4/5/7.5/10/15/20/25 లక్షలు మరియు ఫ్లోటర్ (స్వీయ మరియు జీవిత భాగస్వామి) ఆధారంగా - 10/15/20/25 లక్షలు.
essentials

ఆధునిక చికిత్స

విట్రియల్ ఇంజెక్షన్లు, రోబోటిక్ సర్జరీలు మొదలైన ఆధునిక చికిత్సలకు అయ్యే ఖర్చులు పాలసీ క్లాజ్‌లో పేర్కొన్న పరిమితుల వరకు కవర్ చేయబడతాయి.
essentials

ప్రీమియంపై తగ్గింపులు

ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయడానికి మరియు రెన్యూ చేసుకోవడానికి 5% తగ్గింపు. అదనంగా, పాలసీని కొనుగోలు చేయడానికి లేదా రెన్యూ చేసుకోవడానికి ముందు 45 రోజులలోపు జాబితా చేయబడిన వైద్య పరీక్షలను చేయించుకున్న ఆరోగ్యవంతమైన వ్యక్తులకు 10% తగ్గింపు వర్తిస్తుంది.
essentials

ముందుగా ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పిరియడ్

ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజెస్ (PED) మరియు వాటి సమస్యలు ఈ పాలసీ కింద 12 నెలల తర్వాత కవర్ చేయబడతాయి, దరఖాస్తు సమయంలో వాటిని ప్రకటిస్తే, బీమా సంస్థ ఆమోదిస్తుంది.
essentials

OP కన్సల్టేషన్

నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఔట్ పేషెంట్ కన్సల్టేషన్ పాలసీ నిబంధనలో పేర్కొన్న పరిమితుల వరకు చెల్లించబడుతుంది.
essentials

ప్రవేశ వయస్సు

60 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల సీనియర్ సిటిజన్లు స్థిరమైన ప్రీమియం మరియు జీవితకాల పునరుద్ధరణ ఎంపికతో ఈ పాలసీని పొందవచ్చు.
essentials

వైద్య పరీక్ష

ఈ పాలసీని పొందేందుకు ప్రీ-మెడికల్ టెస్ట్ తప్పనిసరి కాదు.
essentials

పాలసీ రకం

ఈ పాలసీని వ్యక్తిగతంగా లేదా ఫ్లోటర్ ఆధారంగా పొందవచ్చు.
DETAILED LIST

ఇందులో ఏముందో అర్ధం చేసుకోండి

ముఖ్యమైన అంశాలు

పాలసీ టర్మ్

ఈ పాలసీని ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాల టర్మ్‌కు పొందవచ్చు.

సమ్ ఇన్సూర్డ్

ఈ పాలసీ కింద సమ్ ఇన్సూర్డ్ ఎంపికలు రూ. 1,00,000/-, రూ. 2,00,000/-, రూ. 3,00,000/-, రూ. 4,00,000/-, రూ. 5,00,000/-, రూ. 7,50,000/- , రూ. 10,00,000/-, రూ. 15,00,000/-, రూ. 20,00,000/- మరియు రూ. 25,00,000/-. ఫ్లోటర్ ప్రాతిపదికన సమ్ ఇన్సూర్డ్ ఎంపిక రూ. 10,00,000/- నుండి రూ. 25,00,000/- అందుబాటులో ఉంది.

ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్

అనారోగ్యం, గాయం లేదా ప్రమాదాల కారణంగా 24 గంటల కంటే ఎక్కువ కాలం పాటు ఆసుపత్రిలో చేరిన ఖర్చులు కవర్ చేయబడతాయి.

ప్రీ-హాస్పిటలైజేషన్

ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌తో పాటు, ఆసుపత్రిలో చేరిన తేదీకి 30 రోజుల ముందు వరకు అయ్యే వైద్య ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.

పోస్ట్-హాస్పిటలైజేషన్

పాలసీ నిబంధనలో పేర్కొన్న పరిమితుల ప్రకారం ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య ఖర్చులు 7% వరకు కవర్ చేయబడతాయి.

గది అద్దె

ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ సమయంలో అయ్యే గది, బోర్డింగ్ మరియు నర్సింగ్ ఖర్చులకు ఎంచుకున్న సమ్ ఇన్సూర్డ్‌కు గరిష్టంగా రూ. 10,000/-కవర్ చేయబడతాయి.

ICU ఛార్జీలు

రూ 10 లక్షలు వరకు సమ్ ఇన్సూర్డ్‌లో 2% వరకు ICU ఖర్చుల కొరకు చెల్లించబడతాయి. సమ్ ఇన్సూర్డ్ రూ.15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు, ICU ఛార్జీలు అయినంత మేరకు కవర్ చేయబడతాయి.

రోడ్డు అంబులెన్స్

ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ద్వారా ఇన్సూర్డ్ చేయబడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి అయ్యే అంబులెన్స్ ఛార్జీలు కవర్ చేయబడతాయి.

డే కేర్ ప్రక్రియలు

సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కంటే తక్కువ ఆసుపత్రిలో చేరాల్సిన వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సా విధానాలు కవర్ చేయబడతాయి.

కంటిశుక్లం చికిత్స

క్యాటరాక్ట్ చికిత్స కోసం అయ్యే ఖర్చులు పాలసీ క్లాజ్‌లో పేర్కొన్న పరిమితుల వరకు 24 నెలల నిరీక్షణ వ్యవధి తర్వాత కవర్ చేయబడతాయి.

సహ చెల్లింపు

ఈ పాలసీ అన్ని క్లెయిమ్‌లకు 30% సహ-చెల్లింపుకు లోబడి ఉంటుంది.

ఆరోగ్య పరీక్షలు

ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో వార్షిక ఆరోగ్య పరీక్ష కోసం అయ్యే ఖర్చులు పేర్కొన్న పరిమితుల వరకు కవర్ చేయబడతాయి.

వాయిదా ఎంపికలు

పాలసీ ప్రీమియం త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. ఇది వార్షిక, ద్వైవార్షిక (2 సంవత్సరాలకు ఒకసారి) మరియు త్రైవార్షిక (3 సంవత్సరాలకు ఒకసారి) ప్రాతిపదికన కూడా చెల్లించబడుతుంది.
పాలసీ వివరాలు మరియు నిబంధనలు & షరతులను తెలుసుకోవడానికి దయచేసి పాలసీ డాక్యుమెంట్‌లను చూడండి.
స్టార్ హెల్త్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్‌గా, మేము మా సేవలను ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను అందించడం నుండి సత్వర ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వరకు విస్తరింపజేశాము. నానాటికీ మా పెరుగుతున్న ఆసుపత్రుల నెట్‌వర్క్‌తో, మీ వైద్య అవసరాలను తీర్చడానికి మీకు సులభ ప్రాప్యతను అందించేలా చూస్తాం.

మరి దేనికోసమైనా చూస్తున్నారా?

ప్రారంభించండి

ఉత్తమమైనదానిని పొందుతామనే హామీ పొందండి

మీ భవిష్యత్తును మావద్ద సురక్షితంగా ఉంచండి.

Contact Us
మరింత సమాచారం కావాలా?
Get Insured
మీ పాలసీ పొందడానికి సిద్ధంగా ఉన్నారా?

 సీనియర్ సిటిజన్ల కోసం హెల్త్ ఇన్సూరెన్స్

 

వృద్ధాప్యం – వృద్ధాప్యం అనేది ఒక సహజ ప్రక్రియ, ఇది మన సమాజంలోని అన్ని వర్గాలకు ఒక ప్రత్యేకమైన సవాలుగా ఉంటుంది. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిగత పౌరులను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. భారతదేశంలోని మొదటి లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ (LASI) ప్రకారం, భారతదేశంలోని ప్రతి ముగ్గురు సీనియర్ సిటిజన్లలో ఇద్దరు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. వృద్ధులలో ఎక్కువగా ఉన్నట్లు గమనించిన వ్యాధులలో కార్డియోవాస్కులర్ వ్యాధులు (CVD), దీర్ఘకాలిక రక్తపోటు, మధుమేహం, ఎముకలు మరియు కీళ్ల వ్యాధులు మరియు మరిన్ని ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ అవసరాలు పదవీ విరమణ యొక్క అతిపెద్ద 'తెలియని వాటిలో' ఒకటి. సీనియర్ సిటిజన్స్ అయిన మీ ఆర్థిక దృక్కోణం నుండి, అటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రామాణిక చికిత్సను పొందడం వలన పెరుగుతున్న వైద్య ఖర్చుతో మీ పొదుపులు కుంటుబడి మరియు మీ పదవీ విరమణ పొదుపు లక్ష్యాలను నిర్దేశించుకోవడం కష్టమవుతుంది. సీనియర్ సిటిజన్లకు వారి ప్రత్యేక ఆరోగ్య అవసరాలను తీర్చడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. అందువల్ల, మీ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చే సరైన మరియు సమర్థవంతమైన హెల్త్ ప్లాన్‌తో మిమ్మల్ని మీరు వెంటనే కవర్ చేసుకోండి.

 సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సీనియర్ స్టిజన్లకు ప్రయోజనకరమైన విధానంలో అందజేస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా 60 నుండి 75 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించబడింది.

 

ఈ పాలసీ సీనియర్ సిటిజన్‌లకు ఉత్తమ ప్రయోజనాలతో లభిస్తుంది, ఇందులో ఆధునిక చికిత్సలు, ముఖ్యమైన వైద్యపరమైన ప్రక్రియలు, స్థిరమైన ప్రీమియం మరియు  జీవితకాల రెన్యూవల్ ఎంపికలతో లభ్యతతో రెండవ పాలసీ సంవత్సరం నుండి ఇప్పటికే ఉన్న వ్యాధులతో కూడిన విస్తృత శ్రేణి డేకేర్ ప్రక్రియలకు కవరేజీ లభిస్తుంది. పాలసీ వ్యక్తిగత/ఫ్లోటర్ సమ్ ఇన్సూర్డ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు మెడికల్ ఇన్సూరెన్స్ కోసం ఉత్తమ పాకెట్-ఫ్రెండ్లీ ప్రీమియం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఇది సముచితమైనది. పాలసీలోని ముఖ్యాంశం ఏమిటంటే, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ చెకప్ అవసరం లేదు. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు సెక్షన్ 80డి కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

 60+ వృద్ధులు ఎందుకు స్టార్ హెల్త్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి

 

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకప్పుడు దేశాన్ని నిర్మించిన సీనియర్ సిటిజన్ల కోసం ఆరోగ్య ప్రణాళికలను రూపొందిస్తుంది. సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వృద్ధుల సమాజానికి మద్దతుగా అందించబడుతున్న పూర్తి ప్లాన్.

పాలసీని కొనుగోలు చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లు అనేక విలువైన ప్రయోజనాలు పొందుతున్నారు:

 

  • నెట్‌వర్క్ హాస్పిటల్‌లో ఏదైనా ఔట్ పేషెంట్ వైద్య సంప్రదింపులపై కవరేజీ
  • ప్రీ-ఇన్సూరెన్స్ మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేదు.
  • ముందుగా ఉన్న వ్యాధులు (PED) ఒక సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ చేయబడతాయి.
  • డేకేర్ ప్రక్రియలు మరియు ఆధునిక చికిత్సల కోసం విస్తృత కవరేజీ.

 

ప్రత్యేకిత సీనియర్ సిటిజన్స్ క్లెయిమ్‌లు & గ్రీవెన్స్

 

ఇన్సూరెన్స్ సంస్థపై ఫిర్యాదులు ఉన్న పాలసీదారులు ముందుగా లింక్‌లోని బీమా సంస్థ యొక్క ఫిర్యాదులు/గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్‌ను సంప్రదించాలి,

https://www.starhealth.in/grievance-redressal

ఇమెయిల్:gro@starhealth.in లేదా grievances@starhealth.in వద్ద ఇమెయిల్ చేయవచ్చు

వారు సహేతుకమైన వ్యవధిలో బీమాదారు నుండి ప్రతిస్పందనను అందుకోకపోతే లేదా కంపెనీ ప్రతిస్పందనతో అసంతృప్తి చెందితే,

ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IGMS) - IRDAI ను  సంప్రదించండి. పోర్టల్ https://igms.irda.gov.in లో ఫిర్యాదులను నమోదు చేయడానికి ఈమెయిల్‌కి మెయిల్ చేయండి complaints@irdai.gov.in

మరియు టోల్ ఫ్రీ నంబర్ 155255 లేదా 1800 4254 732కు కాల్ చేయవచ్చు.

 

సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా పన్ను ప్రయోజనం

 

పాలసీ యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, బీమా చేయబడిన వ్యక్తి నగదు కాకుండా మరే ఇతర విధానం ద్వారా చెల్లించిన ప్రీమియంకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80-D కింద పన్ను ప్రయోజనాలకు అర్హులు.

 తరచుగా అడిగే ప్రశ్నలు

Disclaimer:
The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply.