పరిచయం
మనం ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడల్లా, మానసిక లేదా మనస్తత్వ ఆరోగ్యం గురించి మనం తరచుగా మరచిపోతూ ఉంటాము. కానీ మన శరీరాల మాదిరిగానే మన మనస్సు కూడా అనారోగ్యానికి గురవుతుంది అని మనము తెలుసుకోవాలి. మానసిక అనారోగ్యం అనేది వారు ఎవరైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. లింగ భేదం ఇంకా సామాజిక స్థితి మొదలైన వాటితో సంబంధం లేకుండా మానసిక అనారోగ్యం ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. ప్రజలు దీని వలన ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలు, వీటిని ఎలా గుర్తించాలి, ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరియు వారికి సహాయం చేయడానికి మనం ఏమి చేయవచ్చు వంటి వాటితో సహా మానసిక ఆరోగ్యం గురించి మరింత విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వివిధ రకాలకు చెందిన మానసిక వ్యాధులు
మానసిక అనారోగ్యాలు అనేవి వివిధ కారణాల వల్ల సంభవిస్తాయి మరియు ఇక్కడ తెలియచేసినవి కొన్ని సాధారణమైనవి :
1. ఆందోళన మరియు సంబంధిత రుగ్మతలు / యాంగ్జైటీ మరియు వాటికి సంబందించిన డిసార్డర్స్: ఈ వర్గంలో అధిక ఆందోళన, భయం లేదా ఆందోళన వంటి రుగ్మతలు ఉంటాయి, తరచుగా నిర్దిష్ట పరిస్థితులు లేదా ట్రిగ్గర్‌లకు ఇవి ప్రతిస్పందనగా ఉంటాయి. వీటికి ఉదాహరణలు :
- జెనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ (Generalized Anxiety Disorder)
- పానిక్ డిసార్డర్ (Panic Disorder)
- సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ (Social Anxiety Disorder)
- అబ్సెసివ్-కంపల్సివ్ డిసార్డర్ (Obsessive-Compulsive Disorder)
- పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (Post-Traumatic Stress Disorder)
2. మూడ్ డిసార్డర్: మానసిక రుగ్మతలు ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ స్థితిలో ఆటంకాలను కలిగిస్తాయి, ఇది వారి యొక్క మానసిక స్థితి మరియు ప్రవర్తనలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది. వీటికి ఉదాహరణలు:
- డిప్రెషన్ (Depression)
- బైపోలార్ డిసార్డర్ (Bipolar Disorder)
3. సైకోటిక్ డిసార్డర్స్: మానసిక రుగ్మతలు అనేవి భ్రాంతులు, భ్రమలు మరియు అస్తవ్యస్తమైన ఆలోచనలతో సహా వాస్తవికతతో సంబంధాలు లేని విధంగా ఉండటం ద్వారా వర్గీకరించబడిన తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితులు. వీటికి ఉదాహరణలు:
- మనోవైకల్యం (Schizophrenia)
- స్కిజోఆఫెక్టివ్ డిసార్డర్ (Schizoaffective Disorder)
4. ఈటింగ్ డిసార్డర్స్: ఈటింగ్ డిసార్డర్స్‌లో వారు తినే ప్రవర్తనలు, శరీర చిత్రం మరియు బరువు నియంత్రణలో ఆటంకాలను కలిగి ఉంటాయి, ఇది తరచుగా తీవ్రమైన శారీరక మరియు భావోద్వేగ పరిణామాలకు దారి తీస్తుంది. వీటికి ఉదాహరణలు :
- అనోరెక్సియా నెర్వోసా (Anorexia Nervosa)
- బులిమియా నెర్వోసా (Bulimia Nervosa)
- అతిగా తినే రుగ్మత / బిన్జ్ ఈటింగ్ డిసార్డర్ (Binge-Eating Disorder)
5. పర్సనాలిటీ డిసార్డర్స్: వ్యక్తిత్వంలో లోపాలు సాంస్కృతిక అంచనాల నుండి తప్పుకోవటం మరియు విపరీతమైన బాధను కలిగించే ఆలోచనలు, భావాలు ఇంకా ప్రవర్తనల యొక్క శాశ్వతమైన నమూనాలను కలిగి ఉంటాయి. వీటికి ఉదాహరణలు :
- బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిసార్డర్ (Borderline Personality Disorder)
- యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ (Antisocial Personality Disorder)
- ఎవాయిడెంట్ పర్సనాలిటీ డిసార్డర్ (Avoidant Personality Disorder)
6. న్యూరో డెవలప్‌మెంటల్ డిసార్డర్స్: న్యూరో డెవలప్‌మెంటల్ డిసార్డర్స్ అనేది మెదడు యొక్క అభివృద్ధిని ప్రభావితం చేసే పరిస్థితుల సమూహం, ఇది అభిజ్ఞా, సామాజిక మరియు ప్రవర్తనా పనితీరులో ఇబ్బందులకు దారితీస్తుంది. వీటికి ఉదాహరణలు
- శ్రద్ధలో-లోటు/హైపర్ ఆక్టివిటీ డిసార్డర్ (Attention-Deficit/Hyperactivity Disorder)
- ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ (Autism Spectrum Disorder)
- న్యూరోకాగ్నిటివ్ డిసార్డర్ (Neurocognitive Disorders) (ఉదా, చిత్తవైకల్యం / dementia)
7. పదార్థ-సంబంధిత మరియు వ్యసన రుగ్మతలు/సబ్స్టాన్స్ - రిలేటెడ్ మరియు అడిక్టీవ్ డిసార్డర్స్: పదార్థ-సంబంధిత మరియు వ్యసనాలకు గురైన రుగ్మతలు, ఇవి పదార్ధాలను సమస్యాత్మకంగా వినియోగించటం ద్వారా వ్యక్తులలో ఏర్పడుతాయి. ఇది వ్యసనాలకు గురికావటం, ఇతరులపై ఆధారపడటం మరియు రోజువారీ జీవితంలో విపరీతమైన బలహీనతకు దారితీస్తుంది.
8. డిసోసియేటివ్ డిసార్డర్స్: డిసోసియేటివ్ డిసార్డర్స్ అనేది స్పృహ, జ్ఞాపకశక్తి, గుర్తించటం లేదా అవగాహనలో అంతరాయాలు ఏర్పడటం వంటివి కలిగి ఉంటాయి, తరచుగా గాయాల ద్వారా లేదా తీవ్రమైన ఒత్తిడికి ఇది ప్రతిస్పందనగా ఉంటుంది.
9. స్లీప్-వేక్ డిసార్డర్స్: స్లీప్-వేక్ డిసార్డర్లు నిద్ర విధానాలలో ఆటంకాలను కలిగించే అనేక రకాల పరిస్థితులను కలిగి ఉంటాయి, ఇది నిద్రలోకి జారుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు లేదా నిద్ర మేల్కొనే సమయంలో ఎక్కువగా నిద్రపోవడానికి దారితీస్తుంది.
మానసిక అనారోగ్యం యొక్క 5 సంకేతాలు:
మానసిక అనారోగ్యానికి ఈ క్రింద 5 సంకేతాలను ఇవ్వడం జరిగింది మరియు ఇవి పైన పేర్కొన్నటువంటి ఏదైనా రుగ్మతలతో సంబంధం కూడా కలిగి ఉండవచ్చు. సంకేతాలను అంచనా వేయడానికి మేము కొన్ని సందర్భానికి తగినట్లుగా ఉదాహరణలను ఇక్కడ అందించాము.
1. మానసిక స్థితి లేదా భావోద్వేగాలలో మార్పులు:
- నిరంతర విచారం, నిస్సహాయత లేదా శూన్యతను (నిరాశకు సూచన) కలిగి ఉండటం.
- మానసిక స్థితి విపరీతంగా గరిష్ఠ స్థాయి నుండి కనిష్ట స్థాయికి మారుతుంది (బైపోలార్ డిసార్డర్స్ యొక్క ముఖ్య లక్షణం ఇది).
- తీవ్రమైన ఆతృత, ఆందోళన లేదా భయం కలిగి ఉండటం (యాంగ్జైటీ డిసార్డర్స్ లలో ఇది కనిపిస్తుంది).
- కోపం, చిరాకు లేదా శత్రుత్వాన్ని కలిగి ఉండటం (వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులలో ఇవి సాధారణం).
సందర్భానికి తగినట్లు ఉదాహరణలు:
- నిరంతరం నిరాశ లేదా నిస్సహాయత భావనను కలిగి ఉండటం (ఇది నిరాశకు సంకేతం).
- చాలా భాదను అనుభవించిన (బైపోలార్ డిసార్డర్ యొక్క లక్షణం) తర్వాత తీవ్రమైన ఆనందాన్ని అనుభవించే సందర్భాలను కలిగి ఉండటం.
- సాంఘిక పరిస్థితులలో (సోషియల్ యాంగ్జైటీ డిసార్డర్ యొక్క లక్షణం) అధికంగా ఆందోళన లేదా ఆత్రుత భావన కలిగి ఉండటం.
2. ప్రవర్తన లేదా అలవాట్లలో మార్పులు రావటం:
- సామాజిక కార్యకలాపాలు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి ఉపసంహరించుకోవడం (డిప్రెషన్, సోషియల్ యాంగ్జైటీ లేదా ఇతర పరిస్థితులలో ఇది కనిపిస్తుంది).
- నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం (మూడ్ డిసార్డర్స్‌లో ఇది సాధారణం) వంటి నిద్ర విధానాలలో మార్పులు రావటం.
- లక్షణాలను (సబ్స్టాన్స్ యూస్ డిసార్డర్లో దీనిని చూడవచ్చు) ఎదుర్కోవటానికి ఒక మార్గంగా మందులు, ఆల్కహాల్ లేదా ఇతర పదార్ధాల యొక్క వాడకం పెరగటం.
- పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రమాదకర లేదా ఉద్రేకపూరిత ప్రవర్తనలను ఆకట్టుకోవడం (బైపోలార్ డిసార్డర్, బోర్డరులైన్ పర్సనాలిటీ డిసార్డర్ లేదా ఇతర పరిస్థితులలో ఇవి కనిపిస్థాయి).
సందర్భానికి తగినట్లు ఉదాహరణలు:
- ఒకసారి ఆనందించిన సామాజిక సమావేశాలు లేదా ఇతర కార్యకలాపాలను నివారించడం (డిప్రెషన్, సోషియల్ యాంగ్జైటీకి ఇది సంకేతం).
- మానసిక భాదను తగ్గించడానికి అధికంగా తాగడం (సబ్స్టాన్స్ యూస్ డిసార్డర్ లో ఇది ఒక సంకేతం).
- వ్యక్తిగత భద్రత (ఉన్మాదభరిత సంఘటన సమయంలో బైపోలార్ డిసార్డర్ యొక్క లక్షణం ఇది) గురించి ఆందోళన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం.
3. ఆలోచన లేదా అవగాహనలో మార్పులు రావటం:
- ఏకాగ్రత, గుర్తుంచుకోవడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉండటం (డిప్రెషన్, యాంగ్జైటీ లేదా ఇతర పరిస్థితులలో ఇది సాధారణం).
- మతిస్థిమితం (Paranoia) లేదా అనుమానం, ఇతరులు మీపై వ్యతిరేకంగా పన్నాగం పన్నారని నమ్మడం (ఇలాంటి సైకోటిక్ డిసార్డర్స్ యొక్క లక్షణం మనోవైకల్యం (schizophrenia))
- నియంత్రించడానికి కష్టంగా ఉండే అనుచితమైన ఆలోచనలు లేదా వ్యామోహాలను కలిగి ఉండటం (ఇది అబ్సెసివ్-కంపల్సివ్ డిసార్డర్ యొక్క లక్షణం).
- లేని విషయాలను ఊహించుకుని చూడడం లేదా వినడం వంటి భ్రాంతులను కలిగి ఉండటం (ఇది సైకోటిక్ డిసార్డర్స్ యొక్క లక్షణం).
సందర్భానికి తగినట్లు ఉదాహరణలు :
- చురుకైన ఆలోచనలు లేదా పనులపై దృష్టి సారించలేనటువంటి (ఇది యాంగ్జైటీ లేదా ADHD యొక్క సంకేతం) భావనను కలిగి ఉండటం.
- లేనివి ఊహించుకుని మాటలు వినడం లేదా ఇతరులు చేయని విషయాలను చూడటం (ఇది స్కిజోఫ్రెనియా యొక్క లక్షణం).
- పరిశుభ్రత లేదా క్రమబద్ధత (ఇది OCD యొక్క లక్షణం) గురించి నిరంతరం చింతిస్తూ ఉండడం.
4. శారీరక లక్షణాలు:
- అలసటగా ఉండటం, శక్తి లేకపోవడం, లేదా వివరించలేని నొప్పులు మరియు భాదగా ఉండటం (డిప్రెషన్ మరియు యాంగ్జైటీలో ఇది సాధారణం).
- ఆకలిలో మార్పులు రావటం, బరువు తగ్గడం లేదా పెరగడం వంటివి ఉండటం (ఇది ఈటింగ్ డిసార్డర్ యొక్క లక్షణం).
- నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం (ఇది మూడ్ డిసార్డర్స్ మరియు యాంగ్జైటీ డిసార్డర్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది).
- వైద్యపరమైన కారణం లేకుండా తలనొప్పి, కడుపునొప్పి లేదా ఇతర శారీరక సమస్యలను కలిగి ఉండటం (ఇవి తరచుగా యాంగ్జైటీ డిసార్డర్స్ లేదా సోమాటిక్ సింప్టమ్ డిసార్డర్స్ ఉన్న వ్యక్తులలో కనిపిస్తాయి).
సందర్భానికి తగినట్లు ఉదాహరణలు:
- నిరంతరం అలసిపోయినట్లు ఉండటం మరియు ప్రేరణ లేకపోవడం (ఇది డిప్రెషన్ యొక్క సంకేతం).
- ఒత్తిడి కారణంగా తరచుగా కడుపునొప్పి లేదా తలనొప్పిని అనుభవించడం (ఇది యాంగ్జైటీ డిసార్డర్స్ యొక్క లక్షణం).
- పరిమితం చేయబడిన ఆహారం తీసుకోవటం ద్వారా విపరీతంగా బరువు తగ్గడం (అనోరెక్సియా నెర్వోసా కోసం ఇది ఒక సంకేతం).
5. సామాజిక లేదా బంధుత్వలో ఏర్పడే ఇబ్బందులు:
- మానసిక కల్లోలం, చిరాకు లేదా ఉపసంహరించుకోవటం (వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులలో ఇది సాధారణం) వంటి కారణాల వల్ల కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతింటాయి.
- సామాజిక ఒంటరితనం లేదా సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు నిర్వహించడంలో కష్టంగా ఉండటం (ఇది డిప్రెషన్, సోషియల్ యాంగ్జైటీ లేదా పర్సనాలిటీ డిసార్డర్స్ యొక్క సంకేతాలు).
- అనుమానం, మతిస్థిమితం లేదా అపనమ్మకం (సైకోటిక్ డిసార్డర్స్ యొక్క లక్షణం) వంటి కారణాలవల్ల ఇతరులతో విభేదాలు లేదా అపార్థాలను కలిగి ఉండటం.
- ఇతరులు తప్పుగా అర్థం చేసుకున్నట్లు లేదా తప్పుగా తీర్పు చెప్పబడినట్లు భావించడం, ఇది మరింతగా ఉపసంహరించుకోవటానికి లేదా తప్పించుకోవటానికి దారితీస్తుంది (ఇది వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితులలో కనిపిస్తుంది).
సందర్భానికి తగినట్లు ఉదాహరణలు:
- స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండటం, సామాజిక పరస్పర చర్యలను నివారించడం (ఇది డిప్రెషన్ లేదా సోషియల్ యాంగ్జైటీ యొక్క సంకేతం).
- ఇతరులను నమ్మటానికి లేదా మంచి సంబంధాలను కొనసాగించడానికి కష్టపడటం (ఇది బోర్డరులైన్ పర్సనాలిటీ డిసార్డర్ వంటి పర్సనాలిటీ డిసార్డర్ల యొక్క లక్షణం).
- వాస్తవికత లేదా ఇతరుల నుండి విడదీసిన భావనను కలిగి ఉండటం వల్ల విభేదాలు లేదా అపార్థాలకు దారి తీస్తుంది (ఇది స్కిజోఫ్రెనియా యొక్క లక్షణం).
మానసిక రుగ్మతలను నివారించే మార్గాలు:
ఈ క్రింది విధంగా కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం ద్వారా మనము మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు
- విలువైన మద్దతు మరియు సంబంధాలను పొందటానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని వెచ్చించండి.
- ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి ధ్యానం, యోగా, ప్రాణాయామం లేదా ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనండి మరియు విశ్రాంతిని పొందటం కోసం కొన్ని మార్గాలను కనుగొనండి.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి మరియు మొత్తం శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- అవసరమైనప్పుడు సహాయాన్ని పొందండి, ఒకరి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో ఇది కీలకమైన దశ.
- కష్ట సమయాలను నిర్వహించడానికి, ఎదుర్కొనే దృఢత్వాన్ని కలిగి ఉండటానికి మరియు పోరాట నైపుణ్యాలను పెంపొందించడానికి మార్గాలను తెలుసుకోండి.
- మానసిక అనారోగ్యాన్ని నివారించే పద్దతులను అనుసరించడానికి ఖచ్చితమైన మార్గం లేదు - కానీ సానుకూలంగా ఉండటం మరియు వర్తమానంలో జీవించడం అనేది ఒక సాధారణ పద్ధతి.
- మీరు సంతోషంగా ఉండండి మరియు ఇతరులను సంతోషంగా ఉండనివ్వండి.
ఎవరైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తర్వాత ఏమి చేయాలి?
- థెరపిస్ట్‌తో మాట్లాడండి - వారు మన భావాలను అర్థం చేసుకోవడంలో మరియు తట్టుకునే మార్గాలను నేర్చుకోవడంలో మనకు సహాయపడగలరు.
- డాక్టర్ సూచించినట్లయితేనే మందులను తీసుకోండి - కొన్నిసార్లు, వైద్యులు లక్షణాలతో సహాయపడటానికి మందులను సూచిస్తారు.
- జీవనశైలిని మార్చుకోండి - బాగా తినడం, వ్యాయామం చేయడం మరియు తగినంత నిద్ర పోవటం వంటివి మార్పును కలిగిస్తాయి.
- మద్దతును కలిగించే సమూహాలలో చేరండి - అర్థం చేసుకునేటటువంటి వారు మన చుట్టూ ఉండటం నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది.
- హాస్పిటలైజ్డ్ ట్రీట్‌మెంట్ - తీవ్రమైన సందర్భాలలో, సురక్షితంగా ఉండటానికి మరియు కోలుకోవడానికి కొద్దికాలం పాటు ఆసుపత్రిలో ఉండటం అవసరం కావచ్చు. ఏదైనా ఇతర శారీరక అనారోగ్యం లాగానే ఇది కూడా అని గుర్తుంచుకోండి.
ముగింపు:
మానసిక అనారోగ్యం అనేది చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే విషయం, కానీ దీనికి సిగ్గుపడాల్సిన అవసరం ఏమి లేదు. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా, సంకేతాలను గుర్తించడం మరియు ఒకరికొకరు మద్దతును కలిగి ఉండటం ద్వారా, మనం దీనిలో పెద్ద మార్పును చేయవచ్చు.