లింఫోసైట్లు అంటే ఏంటి?
లింఫోసైట్లు, రోగనిరోధక కణాలు. ఒక రకమైన తెల్లరక్తకణాలు. శరీరం ఎదుర్కొనే అనారోగ్యం మరియు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ కణాలు పనిచేస్తాయి. ప్రతి తెల్ల రక్త కణం దానికంటూ ప్రత్యేక పనితీరును కలిగి ఉంటుంది. అన్నీ కలిసి రోగనిరోధక వ్యవస్థగా పనిచేస్తాయి. లింఫోసైట్లు ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతాయి. రక్తం మరియు శోషరస కణజాలాలో కనిపిస్తాయి.
లింఫోసైట్ల పనితీరు ఏమిటి?
లింఫోసైట్లు మీ శరీరానికి గార్డుల మాదిరి రక్షణగా పనిచేస్తాయి. అనారోగ్యం, వ్యాధులు మరియు ఆరోగ్య ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. లింఫోసైట్లు ఎముక మజ్జలో పుట్టి మరియు మీ శరీరం అంతటా వ్యాపిస్తాయి.
లింఫోసైట్‌లలో, రెండు ప్రధాన రకాలు T లింఫోసైట్‌లు మరియు B లింఫోసైట్‌లు. B లింఫోసైట్‌లు సూక్ష్మజీవులను ఎదుర్కోవడానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. T లింఫోసైట్‌లు మీ శరీరంలో చేరే సూక్ష్మజీవులపై నేరుగా దాడి చేస్తాయి.
లింఫోసైట్లు సూక్ష్మజీవి, వైరస్ లేదా బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన యాంటిజెన్‌ను మర్చిపోవు. దీంతో లింఫోసైట్ కణాలు 2వ సారి యాంటిజెన్‌ను ఎదుర్కొన్నప్పుడు అవి మెమరీ కణాల సహాయంతో వెంటనే ప్రతిస్పందిస్తాయి.
అవి ఎలా స్పందిస్తాయి?
మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ లింపోసైట్‌లను క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి మరియు వైరస్‌లు, యాంటిజెన్‌లపై దాడి చేయడానికి ఉపయోగపడతాయి.
రోగనిరోధక వ్యవస్థ తనకు ఎదురయ్యే ప్రతి యాంటిజెన్‌ను గుర్తించుకోవడంలో లింఫోసైట్‌ల సహాయం నుంచి ప్రయోజనం పొందుతాయి. కొన్ని లింఫోసైట్లు చనిపోయిన తర్వాత మెమరీ కణాలుగా మారుతాయి.
జ్ఞాపకశక్తి కణాలు యాంటిజెన్‌ను గుర్తించి, మళ్లీ దానితో సంబంధంలోకి వచ్చాక చాలా వేగంగా ప్రతిస్పందిస్తాయి. జ్ఞాపకశక్తి కణాల కారణంగా తట్టు లేదా చికెన్‌పాక్స్ వంటి కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువసార్లు సంక్రమించవు. అలాగే టీకాల ద్వారా నివారించగలిగే అనారోగ్యాల గురించి ఇది వివరిస్తుంది.
B కణాలు, T కణాల పాత్ర
T కణాలు
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో టీ కణాలు సహాయపడతాయి. బ్యాక్టీరియా, వైరస్‌లు మరియు శిలీంధ్రాల వంటి వ్యాధికారిక కారకాలకు మనుషులు గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ శరీరంలో T లింఫోసైట్లు లేదా T కణాలు లేకపోతే వ్యాధులు మరింత ప్రాణాంతకం కావొచ్చు.
T లింఫోసైట్స్ ద్వారా క్యాన్సర్ కణాలను తొలగించవచ్చు. ఇన్వాసివ్ ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించడంలో B కణాలకు సహాయం చేయడం ద్వారా T కణాలు రోగనిరోధక ప్రతిస్పందనను కూడా నియంత్రిస్తాయి.
B కణాలు
B కణాలు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. B కణాలు లేదా B లింఫోసైట్లు ఒక రకమైన ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని యాంటీబాడీగా సూచిస్తారు. ఈ ప్రతిరోధకాలు వాటిని తటస్థీకరించడానికి టాక్సిన్స్ లేదా వ్యాధికారక పదార్థాలతో బంధిస్తాయి.
ఒక యాంటీబాడీ ఒక వ్యాధికారకానికి కట్టుబడి ఉండి.. ఆరోగ్యకరమైన కణానికి సోకకుండా మరియు ఇన్‌ఫెక్షన్‌కు కారణం అవుతుంది. సోకిన కణాన్ని చంపడానికి B కణాలు ఇతర కణాల సహాయాన్ని కూడా పొందవచ్చు.
T లింఫోసైట్లు.. రకాలు
సైటోటాక్సిక్ T కణాలు
CD8+ కణాలు అని కూడా పిలిచే సైటోటాక్సిక్ T కణాలు, హానికరమైన లేదా లక్ష్యకణాలను చంపడానికి బాధ్యత వహిస్తాయి. వాటిని గుర్తించిన తర్వాత, వాటి పనితీరు అపోప్టోసీస్ ద్వారా జెర్మ్స్, ట్యూమర్, ఇన్‌ఫెక్షన్ సోకిన కణాల తొలగింపుపై దృష్టి పెడుతుంది.
సెల్ యొక్క అంతర్గత అవయవాలు అపోప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా నాశనం చేయబడతాయి. దీని ఫలితంగా కణం నాశనం అవుతుంది. మరియు కణ మరణానికి దారితీస్తుంది.
సహాయక T కణాలు
CD4+ అని కూడా పిలవబడే T సహాయక కణాలు సైటోటాక్సిక్ కణాలను పోలి ఉంటాయి. కానీ అనేక రకాల పనులను నిర్వహిస్తాయి. మెజార్టీ అనుకూల రోగనిరోధక ప్రతిస్పందనలు ఈ కణాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవి సెల్ యొక్క రోగనిరోధకశక్తికి కీలకమైనవి.
T సహాయక కణాల క్రియాశీలతకు యాంటిజెన్‌ల ఉనికి అవసరం. మరియు విభిన్న కణ ఉప రకాలుగా అభివృద్ధి చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సహాయక T కణాలు సక్రియం చేయబడినప్పుడు, అవి మాక్రోఫేజ్‌లు మరియు సైటోటాక్సిక్ T కణాలను సంక్రమణ ప్రదేశానికి ఆకర్షించే సైటోకిన్‌లను విస్తరిస్తాయి. మరియు విడుదల చేస్తాయి.
రెగ్యులేటరీ T కణాలు
రెగ్యులేటరీ T కణాలు ప్రభావవంతమైన కణాల యొక్క చివరి రకం. ముప్పు తొలగించడిన తర్వాత స్వయం ప్రతిరక్షక ప్రతిచర్యను ఆపడానికి నియంత్రణ T కణాలు బాధ్యత వహిస్తాయి.
సహాయక T కణాలు మరియు సైటోటాక్సిక్ T కణాలు వ్యాధికారకానికి కట్టుబడి మరియు శరీరం నుంచి దానిని తొలగించడానికి సమన్వయంతో పనిచేసిన తర్వాత ఉపయోగపడవు.
లింఫోసైట్ల గణన కోసం ఏ పరీక్ష చేస్తారు?
లింఫోసైట్‌ల సంఖ్యను పరీక్షించడానికి ఈ క్రింద పరీక్షలు ఉన్నాయి.
కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష ద్వారా మీ రక్తంలోని వివిధ భాగాల పూర్తి వివరాలు తెలుస్తాయి. వివిధ భాగాలలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు, హిమోగ్లోబిన్ మరియు హెమటోక్రిట్ వంటివి ఉంటాయి. ఆరోగ్య సంరక్షణ నిపుణులు మీ రక్త నమూనాను సేకరించి.. తదుపరి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపుతారు.
ఫ్లో సెటోమెట్రీ అనేది నిర్దిష్ట కణాలను గుర్తించడానికి, మరియు లెక్కించడానికి ఉపయోగపడే పరీక్ష. ఈ పరీక్ష కణాల వివరణాత్మక వివరాలను అందిస్తుంది. మీ రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్తారు. ల్యాబ్‌లో ఉండే నిపుణుడు మీ రక్తాన్ని ద్రవంలోకి నింపి.. ఆ తర్వాతి ఫ్లో సైటోమీటర్ అనే పరికరంలోకి పంపుతారు. ఈ సైటోమీటర్ మీ మాస్ కణాల విశ్లేషణ చేస్తుంది.
లింఫోసైట్ల సంఖ్య ఏమిటి?
రక్తపరీక్ష ఫలితాల తర్వాత మీ రిపోర్టులోని గణనల పరిధి యొక్క స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి డాక్టర్‌తో మాట్లాడండి. కణాలను లెక్కించడానికి ల్యాబ్‌లలో పలు పద్ధతులు ఉపయోగిస్తారు కాబట్టి ఫలితాల్లో తేడాలు ఉండచ్చు. దీంతో లింఫోసైట్ల సంఖ్య భిన్నంగా ఉంటుంది. పెద్దలకు సాధారణ లింఫోసైట్ల పరిధి రక్తంలోని మైక్రోలీటర్‌కు 1000 నుంచి 4800 వరకు ఉంటుంది. పిల్లల్లో ఇది మైక్రోలీటర్ రక్తానికి 3000 నుంచి 9500 మధ్య ఉంటుంది.
తక్కువ మరియు అధిక లింఫోసైట్లు అంటే ఏమిటి?
అధిక లింఫోసైట్ కౌంట్ సాధారణ లింఫోసైట్ల పరిధి కంటే మీ తెల్ల రక్తకణాల లింఫోసైట్‌ల పెరుగుదల ఫలితంగా వస్తుంది. మీ లింఫోసైట్‌ల సంఖ్య పెద్దవారిలో మీ రక్తంలోని మైక్రోలీటరుకు 3000 ఉంటే.. అప్పుడు మీరు అధిక లింఫోసైట్‌లను కలిగి ఉన్నారని భావిస్తారు. పిల్లల్లో ఇది మైక్రోలీటరుకు 9000 వరకు ఉంటుంది.
హెపటైటిస్, HIV మరియు ఎయిడ్స్, క్షయ మొదలైనవి అధిక లింఫోసైట్ కౌంట్‌కు కారణాలు.
తక్కువ లింఫోసైట్ల సంఖ్య అనేది సాధారణ లింఫోసైట్ల పరిధి కంటే మీ తెల్ల రక్తకణాల లింఫోసైట్‌లలో తగ్గుదల ఫలితంగా వస్తుంది. మీ రక్తంలోని మైక్రోలీటరుకు లింఫోసైట్ల సంఖ్య 1000 కంటే తక్కువగా ఉంటే.. మీరు తక్కువ లింఫోసైట్‌లను కలిగా ఉన్నారని భావిస్తారు. పిల్లల్లో ఇది మైక్రోలీటరుకు 3000 లింఫోసైట్‌ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో మీరు తక్కువ లింఫోసైట్‌లను కలిగి ఉన్నారని భావిస్తారు.
తక్కువ లింఫోసైట్ కౌంట్‌కు పలు కారణాలు ఉన్నాయి. కొన్ని రక్త వ్యాధులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రేడియేషన్ మరియు కిమోథెరపీ చికిత్సలు కూడా ఇందుకు కారణాలు.
చికిత్స కోసం ముందుగా కారణం కనిపెట్టాలి. మీ రక్త పరీక్ష రిపోర్టు యొక్క విశ్లేషణ తర్వాత మీ డాక్టర్ మీతో కారణం మరియు సమస్యల గురించి మాట్లాడతారు. మీకు బాగా సరిపోయే చికిత్స గురించి మీతో చర్చిస్తారు.
తక్కువ లింఫోసైట్ల గురించి ఎప్పుడు ఆందోళన చెందాలి?
‘లింఫోసైటోపెనియా’ మీకు ఆందోళన కలిగిస్తుంది. తక్కువ లింఫోసైట్లు మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ యొక్క బలహీనమైన స్థితిని సూచిస్తాయి. ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. అనేక వ్యాధులు, పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
మీ తక్కువ లింఫోసైట్ల గురించి ఎప్పుడు ఆందోళన చెందాలంటే.. రిపోర్టులు వచ్చిన తర్వాత వైద్యుడు కలవాల్సినప్పుడు. లింఫోసైటోపెనియాను అభివృద్ధి చేయడంలో అనేక కరణాలు ఉన్నాయి. ఇవి పలు ప్రమాదం, సమస్యలను కలిగిస్తాయి. డాక్టర్ మాత్రమే లింఫోసైటోపెనియా గురించి స్పష్టత ఇవ్వగలడు. సమస్య ఉన్న వారికి సరైన చికిత్స మరియు మందులు కూడా ఉన్నాయి. అవి మీకు గొప్ప సహాయం చేస్తుంది.
డాక్టర్ను ఎప్పుడు కలవాలి?
ఒక వ్యక్తిలో అధిక లేదా తక్కువ లింఫోసైట్ కౌంట్ ఉన్నప్పుడు.. కొన్ని ఇతర వ్యాధి నిర్ధారణ సమయంలో కనుగొన్న సమయంలో డాక్టర్‌ను కలవాలి.
పరీక్ష రిపోర్టుల తర్వాత వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వ్యాధి యొక్క మూలం అధిక లేదా తక్కువ లింఫోసైట్ కౌంట్ అనేది బయటపడవచ్చు.
కొన్ని వారాల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటే.. లింఫోసైటోటిస్ తగ్గిపోయినట్లు చూపిస్తుంది. ఒకవేళ లింఫోసైటోసిస్ కొనసాగితే.. ప్రత్యేక రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది.
సమస్య మరింత తీవ్రమైతే లేదా కారణం అస్పష్టంగా ఉంటే.. డాక్టర్ హెమటాలజిస్టును కలవమని సూచించవచ్చు. హెమటాలజిస్టు అంటే రక్త సమస్యలపై దృష్టి సారించే డాక్టర్.
ఒక NCBI కథనం ప్రకారం లింఫోసైట్ల(30000 సెల్‌లు/మైక్రోలీటర్ కంటే ALC కంటే ఎక్కువ) లేదా త్వరగా పెరుగుతున్న వాటి గణనలు హెమటాలజిస్టును సంప్రదించడం అవసరం.
చివరిగా
లింఫోసైట్ గణన ఎక్కువగా లేదా తక్కువగా ఉండనివ్వండి. ఇది మీ శరీరంలో అసాధారణతను సూచిస్తుంది. డాక్టర్‌ను సంప్రదించిన అనంతరం చికిత్స తీసుకోవాలి. మీరు దానిని నిర్లక్ష్యం చేస్తే.. మీరు అధికప్రమాదంలో ఉన్నట్లే. లింఫోసైట్ కౌంట్ తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి సంకేతాలు, లక్షణాలు లేకపోవడంతో దాని దానంతట అది నిర్ధారణ చేయబడదు. మీరు ఇతర రోగ నిరోధక పరీక్ష కోసం వెళ్లినప్పుడే ఇది నిర్ధారణ అవుతుంది.
అందుకే ప్రతి 6 నెలలకు ఓ సారి సాధారణ చెకప్‌లకు వెళ్లడం మంచిది. నిజానికి ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పటికే ఉన్న మీ ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుతుంది.
సాధారణ ఆరోగ్య చెకప్‌లు.. తక్కువ రోగనిరోధక స్థాయి కారణం మీరు పొందే అనారోగ్యాల గురించి ముందే హెచ్చరిస్తుంది. ఇది తక్షణ వైద్య చికిత్స అవసరమయ్యే తేలికపాటి లేదా తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే ఇన్ఫెక్షన్లను పొందే అవకాశాలను కూడా సూచిస్తుంది. అయినా వైద్య చికిత్సలు ఖర్చులు పెరుగుతూనే ఉన్నందున, అత్యవసర సమయాల్లో అసాధారణమైన ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుంచి ఒకరిని రక్షించే ఆరోగ్య బీమా పథకం కలిగి ఉండటం మంచిది.
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీ వైద్య పరిస్థితులు, అనారోగ్యాల చికిత్స కోసం గణనీయమైన ఆర్థిక కవరేజీని అందించే బీమా పథకాలను అందుబాటులో ఉంచింది. వ్యక్తిగత మరియు కుటుంబం ఆధారంగా ఆస్పత్రిలో చేరడం లేదా చికిత్స కోసం ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల మధ్య సమగ్ర కవరేజీని నిర్ధారిస్తాయి.