బాహ్య లక్షణాలన్నింటికీ కారణం శరీరం లోపల ఉన్నటువంటి వేడి అని చెప్పాలి. ఈ వేడికి సంబందించిన సమస్యలను నివారించడానికి సహజంగా శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించాలి అని లక్ష్యంగా పెట్టుకోవాలి.
శరీరం యొక్క వేడి మరియు దానిని తగ్గించడానికి ఆచరణాత్మక కొన్ని మార్గాల గురించి తెలుసుకోవలసిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇలాగే చదవడం కొనసాగించండి.
శరీరంలోని వేడిని తగ్గించటానికి చిట్కాలు
విపరీతమైన ఉష్ణోగ్రతకు శరీరం బహిర్ఙ్గతం అయినప్పుడు మరియు వేడిని విపరీతంగా అనుభవించడం వల్ల శరీరంలో వేడి ఏర్పడుతుంది, సాధారణంగా దీనిని వేడి ఒత్తిడి అని పిలుస్తారు, ఇది చాలా వేడి వాతావరణం లేదా వేడి గాలులు వీచే సమయంలో సంభవిస్తుంది. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 97.7-99.5 డిగ్రీల ఫారెన్‌హీట్‌గా పరిగణించబడుతుంది.
శరీరం సమతుల్యతను నిర్వహించలేనప్పుడు, అది వేడి కారణంగా ఒత్తిడికి దారితీస్తుంది. మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
ఒక వ్యక్తి యొక్క శరీరం వేడెక్కినట్లయితే, హైపోథాలమస్ నరాలకు సందేశాన్ని పంపుతుంది, అలా చేయటం వల్ల చర్మం మరింత చెమటను ఉత్పత్తి చేసేలా చేస్తుంది. మరియు చెమట ఆవిరైపోతుంది, దీనివల్ల శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది.
కోల్డ్ ఫుట్ బాత్
ఎండలో బాగా తిరిగి, చాలా శ్రమించి అలసిపోయినపుడు ఒక ఫుట్ టబ్ లో చల్లని నీటిని పోసి అందులో పాదాలను ఉంచి అలాగే కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు, ఇది పాదాలతో పాటు శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది.
ఒక బకెట్ నీటిలో ఐస్ క్యూబ్ లను వేయండి, దానికి చల్లటి నీరు కలపండి. ఇప్పుడు మీ పాదాలను ఆ నీటిలో కాసేపు నానబెట్టండి.
చల్లటి నీరు
వేడికి సంబంధించిన ఏదైనా లక్షణానికి వేగవంతమైన నివారణగా ఒక గ్లాసుడు చల్లటి నీటిని చెప్పవచ్చు. శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇది అత్యంత సరసమైన, సరళమైన మరియు సమర్థవంతమైన పద్దతి. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఏర్పడిన దుష్ప్రభావాల నుండి శరీరం కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది.
కొబ్బరి నీరు
వేసవిలో ఆదర్శ పానీయంగా కొబ్బరి నీటిని చెప్పవచ్చు. డీహైడ్రేషన్ మరియు ఇన్ఫెక్షన్‌లతో సహా వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలకు కొబ్బరి నీరు తాగడం అనేది ఉత్తమమైన సహజ నివారణలలో ఒకటి.
ఈ శీతలీకరణ పానీయం ఎలక్ట్రోలైట్ కాంపోజిషన్ ను కలిగి ఉంటుంది, ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది, మరియు వ్యక్తి యొక్క శక్తిని పెంచుతుంది. మండే ఎండల వల్ల గొంతు ఎండిపోతుంది, డీహైడ్రేషన్, అలసట, నిస్సత్తువ, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వేసవి తాపం తట్టుకోవడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.
పిప్పరమింట్
పుదీనా శరీరం యొక్క వేడిని వేగంగా తగ్గించడంలో సహాయపడి మరియు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఒక కెటిల్లో నీటిని మరిగించి అందులో కొన్ని తాజాగా ఉన్న పుదీనా ఆకులను కలపండి. కొద్ది సేపటి తర్వాత ఆకులను వడకట్టి ఆ నీటిని చల్లబడడానికి కొద్దిసేపు అలాగే వదిలేసి తరువాత సేవించండి. ఈ ఆకులను తాగడానికే కాకుండా సాధారణ స్నానపు నీటిలో 20 నుండి 30 నిమిషాలు నానబెట్టండి తర్వాత వాటితో స్నానం చేయటం ద్వారా కూడా శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ప్రతిరోజూ పదేపదే ఇలా చేయండి. పుదీనా ఆకులను అలాగే పచ్చిగా తీసుకోవటం లేదా పుదీనా ఆకుల రసం నీటితో కలిపి తీసుకోవటం ద్వారా కూడా శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
హైడ్రేటింగ్ ఆహారాలు
పుచ్చకాయ, సీతాఫలం మరియు దోసకాయలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవటం ద్వారా శరీరంలోని వేడిని తగ్గించడానికి వీటిని మరొక సహజ మార్గంగా ఎంచుకోవచ్చు.
కడుపులో చల్లగా ఉండటానికి మరియు గుండెల్లో మంట వంటి సమస్యలను నివారించడానికి వేసవి కాలంలో చల్లటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. సొరకాయ మరియు గుమ్మడికాయ వంటి అధిక నీటిని కలిగినటువంటి కూరగాయలు వేసవిలో తినడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి కూడా పుష్టికరమైన కూరగాయలు, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి మరియు ప్రశాంతంగా ఉంచుతాయి.
ఉల్లిపాయలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించే శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటిన్‌లో ఎక్కువగా పరిగణించబడతాయి. ఇవి వడదెబ్బ నుండి కూడా రక్షించబడటం వల్ల కొందరు దీని వల్ల ప్రయోజనాన్నీ పొందుతున్నారు. ఉల్లిపాయలతో పాటు, క్యారెట్, దోసకాయ మరియు ముల్లంగిని కూడా సలాడ్‌లలో చేర్చుకోవచ్చు.
కలబంద
శరీర వేడిని తగ్గించడానికి అత్యంత విస్తృతంగా ఉపయోగించే సహజ మార్గాలలో కలబందను ఉపయోగించడం ఒకటి. ఇది సహజ శీతలీకరణ ఏజెంట్, అలోవెరా అనేది అధిక శరీర వేడికి బాగా తెలిసిన ఇంకా సమర్థవంతమైన సహజ చికిత్స, మరియు అంతర్గత మరియు బాహ్యంగా శరీర వేడిని తగ్గించే విషయంలో ఇది ప్రశంసనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
కలబంద అనేది బహుళ విధులను నిర్వహించేటటువంటి ఒక మొక్క, ఇది ఒక వ్యక్తి శరీరాన్ని ప్రశాంతంగా మరియు చల్లబరచడం ద్వారా సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. తాజా కలబంద ఆకు యొక్క జెల్‌ను సంగ్రహించి దానిని స్నానం చేయడానికి ముందు 20 నిమిషాల పాటు శరీరానికి అప్లై చేయవచ్చు, మరియు ఆ తర్వాత చల్లటి నీటితో స్నానం చేయవచ్చు.
మజ్జిగ
మజ్జిగ యొక్క ప్రాధమిక మరియు అత్యంత ప్రయోజనకరమైన నాణ్యత అది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయం తీవ్రమైన ప్రోబయోటిక్స్, విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది, తీవ్రమైన వేడిలో కూడా మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
మజ్జిగ ప్రయోజనాలు పురుషులతో పాటు మహిళలకు కూడా అందుబాటులో ఉన్నాయి. మజ్జిగ అధిక శరీర ఉష్ణోగ్రత మరియు జీవక్రియ రేటుతో పురుషులకు సహాయపడుతుంది, మరియు రుతువిరతి సమయంలో సాధారణంగా జరిగే హాట్ ఫ్లాషెస్‌ను ఎదుర్కొనే మహిళలకు, మజ్జిగ సహాయపడుతుంది.
అదనంగా, మజ్జిగ వేసవి వేడిలో ఊపిరాడకుండా కోల్పోయే ముఖ్యమైన ప్రోబయోటిక్ విటమిన్లు మరియు ఖనిజాలను సరఫరా చేస్తుంది. రోజూ లేదా రోజుకు రెండుసార్లు మజ్జిగ తాగడం వల్ల మీ శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. మీ శక్తిని పునరుద్ధరించడానికి మరియు మీ శరీరాన్ని సహజంగా చల్లబరచడానికి ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగడానికి ప్రయత్నించండి.
మెంతికూర
మెంతి లేదా మెంతి గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక ఎంపిక ఏమిటంటే కొన్ని మెంతులు తినడం, మరొకటి ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఆ మరుసటి రోజు ఆ నీటిని తాగటం వంటివి ప్రతి రోజూ చేయడం వల్ల వేడిని తగ్గించటంతో పాటు అధిక ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.
మిరపకాయ
మిరపకాయ జాబితాకు ఉత్తేజకరమైన చేరిక. మిరపకాయలలో క్రియాశీలక భాగం క్యాప్సైసిన్ అని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్యాప్సైసిన్ నరాల సంకేతాలను పంపడం ద్వారా శరీరం స్పందించేలా చేస్తుంది.
ఇది తిన్నప్పుడు, మీ శరీరం మామూలు కంటే ఎక్కువ వేడెక్కుతున్నట్లు మరియు చెమటలు పట్టేలా చేసే సందేశాన్ని మెదడుకు పంపుతుంది. తద్వారా శీతలీకరణ ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు అధిక చెమటను కలిగిస్తుంది, ఇలా శరీరాన్ని చల్లబరుస్తుంది.
పుచ్చకాయ
మామిడి పండ్లతో పాటు వేడిని తట్టుకునే మరోకటి సాధారణంగా వేసవి కాలంలో దొరికే పండు పుచ్చకాయ.
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది (సగటున 92%), ఇది శరీరాన్ని హైడ్రేట్ గా మరియు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. తరచుగా దీనిని తీసుకోవటం ద్వారా ఒక వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది.
దోసకాయలు
దోసకాయలో 95% నీరు ఉంటుంది. దోసకాయ హైడ్రేషన్‌ని అందిస్తుంది మరియు శరీరంలోని విషపదార్ధాలును కూడా తొలగిస్తుంది.
దోసకాయలో ఉండేటటువంటి అధిక నీటి కంటెంట్ శరీరాన్ని శుభ్రపరిచేలా పనిచేస్తుంది మరియు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
నోటి దుర్వాసనకు ప్రధాన కారణం అయినటువంటి కడుపులోని వేడిని తగ్గించడంలో దోసకాయలు సహాయపడతాయి. ఇది బలమైన యాంటీ ఇంఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు శరీరాన్ని చల్లబరుస్తుంది అంతేకాకుండా దోసకాయ తేమగా ఉంటుంది కాబట్టి, చర్మానికి కూడా అద్భుతమైనదిగా పని చేస్తుంది.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలు కూడా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్నాయని తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. వడదెబ్బ నుండి రక్షించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాహ్యంగా ఉపయోగించినప్పుడు, ఉల్లిపాయ రసం దాని శీతలీకరణ ప్రయోజనాలతో పాటు వడ దెబ్బ మరియు కాలిన చర్మానికి చికిత్స చేయడంలో చాలా బాగా ఉపయోగ పడుతుంది.
పెరుగు
ప్రపంచంలోని కొన్ని వెచ్చని దేశాలలో లభించే ఆహారంలో పెరుగు కీలకమైన భాగంగా ఉంటుంది అది భారతదేశంలో దొరికే తీపి లస్సీ రూపంలో అయినా సరే లేదా టర్కీలో దొరికే సాల్టెడ్ ఐరాన్ రూపంలో అయినా సరే.
పెరుగు నోరు, గొంతు మరియు కడుపు లోని ఈ ప్రాంతాలకు పూత మరియు ఉష్ణ వాహకంగా పని చేయడం ద్వారా వేడిని దూరంగా ఉంచుతుంది. పెరుగు చాలా చల్లగా ఉంటుంది మరియు పునరుజ్జీవింపజేసే రుచిని కూడా కలిగి ఉంటుంది.
సెలెరీ
సెలెరీ వేసవిలో ఒక వ్యక్తి చల్లగా ఉండటానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇది 90% నీరు మరియు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇది వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది.
సెలెరీలో ఐరన్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం మరియు జింక్ పుష్కలంగా ఉన్నాయి. సెలెరీ సలాడ్లలో, విడిగా లేదా ఇతర కూరగాయలతో కలిపి వండినప్పుడు ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.
మొక్కజొన్న
కాల్చిన మొక్కజొన్న వేసవి కాలంలో దొరికే ఒక సర్వ సాధారణ ఆహార పదార్థం.
కాల్చినవి ఏవైనా శరీరం యొక్క ఉష్ణోగ్రతను ఎలా తగ్గిస్తుంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మొక్కజొన్నలో ఉండే ఫైటోకెమికల్స్ జియాక్సంతిన్ మరియు లుటిన్, సూర్యకిరణాలు చర్మంపై చురుకుగా చూపించేటటువంటి ప్రభావాన్ని తగ్గిస్తాయి తద్వారా సన్‌బర్న్ కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అలాగే, కాల్చిన మొక్కజొన్నలోని ఫైబర్ నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది, దీని వలన శరీరం డిహైడ్రేషన్ కాకుండా తక్కువ ఉప్పును ఉపయోగించుకుంటుంది.
కోల్డ్ షవర్
నిపుణులు కోల్డ్ షవర్ని సూచించడానికి గల కారణం, ప్రధానంగా చల్లని నీటి జల్లుల వల్ల మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. నీటి జల్లులు శరీరం మరియు అవయవాలను తాకినప్పుడు శరీర ఉపరితలంలో ప్రసరణ పరిమితం చేయబడుతుంది. ఫలితంగా, లోతైన కణజాలం ఆదర్శవంతమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి వేగవంతమైన రక్త ప్రవాహ అనుభూతిని పొందుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం
చెమట పట్టడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఒక వ్యక్తి బయట వేడిలో వ్యాయామం చేస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించటానికి మరియు చెమట పట్టడానికి కష్టపడి పని చేయాల్సి ఉంటుంది.
శరీరం కండరాల నుండి మరియు చర్మం వైపుకు ఎక్కువ రక్తాన్ని నిర్దేశిస్తుంది. చర్మం, చేతులు, కాళ్లు మరియు తలపై ఎక్కువ రక్తాన్ని పంపింగ్ చేయడం ద్వారా, శరీరం ముఖ్యమైన భాగాలలో ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. ఇది శరీరం మరింత వేడి నుంచి తప్పించుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు వాటికి ఉన్నటువంటి పోషక విలువల కారణంగా శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇది 15 రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ల యొక్క అసాధారణమైన మూలం ముఖ్యంగా క్రిమిని పుట్టగొడుగులలో కనిపిస్తుంది. ఈ ప్రయోజనాలు మరియు అవి కలిగినటువంటి పోషకాలను వాటిని తాజాగా తినడం ద్వారా గరిష్టంగా పొందవచ్చు.
చందనం పూయడం
మంచి గంధంలోని ప్రశాంతత మరియు చల్లబరిచే గుణాలు శరీరాన్ని కూడా చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా ఇది వేసవి కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రెండు చెంచాల గంధంపొడి మరియు కొంచెం నీటిని ఉపయోగించి మందపాటి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్‌లో కొన్ని చుక్కల రోజ్ వాటర్ను వేసి నుదుటి పైనా మరియు ఛాతీ పైనా అప్లై చేయండి.
ఇలా పూసుకున్నటువంటి గందాన్ని మూడు నుండి ఐదు నిమిషాలు ఆరనివ్వండి ఆ తర్వాత దానిని నీటితో శుభ్రం చేసుకోండి.
ఉసిరికాయ
భారతీయ గూస్బెర్రీని ఆమ్లా లేదా ఉసిరికాయ అని పిలుస్తారు, ఇందులో విటమిన్ C అధికంగా ఉంటుంది మరియు శరీర వేడిని తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. ఉసిరి మరియు నీటిని వరుసగా 1:4 నిష్పత్తిలో కలపండి.
ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తాగండి మరియు ఉప్పు లేదా పంచదారను కూడా కలిపి రుచిగా తయారు చేసుకోండి. ఈ జ్యూస్‌ని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల, శరీరం ఎంత వేడిగా ఉన్నప్పటికీ కూడా దాని ఆధారంగా, శరీరం నుండి వేడిని విడుదల చేయడంలో సహాయపడుతుంది మరియు వేడి కారణంగా ముఖంపై ఏర్పడే మొటిమలు, దద్దుర్లు మరియు కురుపులను కూడా నివారిస్తుంది.
శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల గింజలను తీసుకోవాలి
మెంతులు
ముందే చెప్పుకున్నట్టు మెంతి గింజలు శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. కొన్ని మెంతి గింజలను అలాగే తీసుకోవచ్చు లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతులను ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టి వాటిని ఉదయాన్నే తాగితే శరీరంలోని వేడి తగ్గి శరీరం చల్లగా ఉంటుంది.
గసగసాలు
గసగసాలు, ఇది సాధారణంగా చాలా వరకు అన్ని రకాల మసాలా కూరలలో కనిపించే మసాలా దినుస్సు, వేడి వల్ల కలిగే అలసటకు సమర్థవంతమైన స్వల్పకాలిక చికిత్సగా దీనిని ఉపయోగించవచ్చు.
ఇవి యాంటీఆక్సిడెంట్స్ గా పని చేస్థాయి, వ్యాధిని నిరోధించే మరియు మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే మొక్కల నుండి తీసుకోబడిన రసాయన భాగాలతో నిండి ఉన్నాయి. అలాగే, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి అంతేకాకుండా ఇవి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో మనకు సహాయపడతాయి.
గసగసాల గింజలను కొద్దిగా నీళ్లతో రుబ్బి ఉప్పును కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఉండటం కోసం, దీనికి కొంత నిమ్మరసం మరియు పుదీనా ఆకులను జోడించి తీసుకోండి.
ధనియాలు
ధనియాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా నిర్వహించడానికి మరియు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి మరియు మనల్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ధనియాలు డయాఫోరేటిక్ లక్షణాలును కలిగి ఉంటాయి, ఇవి జ్వరానికి చికిత్సగా ఉపయోగపడతాయి.
సబ్జా గింజలు
సబ్జా గింజలు, వీటిని సాధారణంగా ఫలూద విత్తనాలు లేదా తులసి గింజలు అని కూడా పిలుస్తారు, ఇవి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలతో కూడిన పోషకాహార శక్తిని కేంద్రంగా కలిగి ఉంటుంది.
తరచుగా వీటినే చియా విత్తనాలుగా కూడా భావించబడి అపోహకు గురౌతున్నారు. తులసి గింజలు జీర్ణక్రియ యొక్క ఆరోగ్యాన్నిపెంపొందించడంలో సహాయ పడుతుంది, బరువును తగ్గించటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రక్తంలో చక్కెరను నియంత్రించడం, శరీరాన్ని చల్లబరచడం, ఒత్తిడిని తగ్గించడం, కడుపులో మంటను తగ్గించడం మరియు కొన్ని ఇతర ఇన్ఫెక్షన్‌లను నివారించడం వంటివి అవి కలిగించే ఆరోగ్య ప్రయోజనాలల్లో కొన్ని మాత్రమే అని చెప్పాలి.
సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి మరియు పొట్టని శాంతపరచడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ గింజలను మిల్క్‌షేక్‌లు, స్మూతీస్, పెరుగు, కొబ్బరి నీరు, కొబ్బరి పాలు మరియు నిమ్మరసంతో సహా అనేక రకాల పానీయాలకు కలిపి తీసుకోవచ్చు. సబ్జా గింజలు సహజంగా వేడిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి, వీటిని వేసవి వేడి నుండి కాపాడుకోవటానికి ఉపయోగించవచ్చు.
అవిసె గింజలు
అవిసె గింజలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల యొక్క గొప్ప మూలంగా వీటిని పేర్కొనటం జరిగింది, కాబట్టి ఇవి ప్రతి ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి.
అవిసె గింజలను రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు మరియు శరీరానికి చల్లదనాన్ని కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. వీటిని వేయించటం వల్ల క్రంచీగా మారుతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో, గింజలుగా లేదా పొడిగా గాని ఖాళీ కడుపుతో తీసుకోండి.
అయినప్పటికీ, దీనిలో ఉన్న జిగురు పదార్థం వల్ల నోటిలోని అంగిలి భాగానికి అతుక్కునట్లు ఉండి నచ్చకపోతే, వాటిని సలాడ్‌లు, రైతా మరియు ఇతర పానీయాల వంటి ఆహారాలకు జోడించడానికి ప్రయత్నించండి, ఆలా చేయటం వల్ల అవి అదే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూనే ఇతర రుచులను కలిగి ఉంటుంది.
జీలకర్ర
భారతీయ వంటలలో అత్యంత ప్రజాదరణ పొందిన సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ఒకటి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు, ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి, ఇది మన శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది అంతేకాకుండా అసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేస్తుంది.
మనం జీలకర్రను నేరుగా తీసుకోవచ్చు, అలాగే వాటిని మనం భోజనంలో చేర్చుకోవచ్చు ఇంకా వేసవికాలపు పానీయాలైన లస్సీ మరియు లెమన్ సోడా వంటి వాటికి మెత్తగా జీలకర్రను పొడిగా చేసి కలిపి తీసుకోవటం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటానికి మరియు వడదెబ్బను నివారించడంలో సహాయపడుతుంది. సాధారణంగా మనం కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం వంటివి కలిగినప్పుడు, జీలకర్రను తీసుకోవటం ద్వారా మనకు హాయిగా మరియు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
శరీరంలోని వేడిని ఎలా తగ్గించుకోవాలో వాటికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు
శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి మీరు పాటించాల్సిన కొన్ని వేసవి ఆరోగ్య చిట్కాలు ఇక్కడ పేర్కొనటం జరిగింది :
- సౌకర్యవంతమైన బట్టలను ధరించండి
- బట్టల ఎంపిక అనేది చర్మంపై గాలి ఎంత బాగా ప్రవహిస్తుంది మరియు ఎంత త్వరగా వేడిని గ్రహించి చెమటను వెదజల్లుతుంది అనే దానిపై ప్రభావం చూపుతుంది. విపరీతమైన వేడి ఉన్నటువంటి సమయంలో చర్మం యొక్క వెచ్చదనం పెరుగుతుంది, దీనివల్ల కొందరికి అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది.
- తీవ్రమైన వేడిలో ఉత్తమమైనటువంటి దుస్తులను ఎంపిక చేసుకోవటం కోసం ఇక్కడ కొన్ని సిఫార్సులు చేయబడ్డాయి.
- ఇంట్లో ఉన్నప్పుడు, వీలైనంత సాధారణ దుస్తులను ధరించండి.
శ్వాసక్రియకు అనుకూలమైనటువంటి, లేత రంగు మరియు వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోండి. లేత రంగు దుస్తులు వేడి మరియు కాంతిని ప్రతిబింబిస్తాయి, అయితే గాలి పీల్చుకునే దుస్తులను ధరించటం ద్వారా శరీరం గాలిని తీసుకుంటూ స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది. ఫలితంగా శరీరం చల్లగా ఉంటుంది.
సహజ ఫైబర్ వస్త్రాలు - పత్తి, నార మరియు పట్టుతో తయారు చేసిన వస్త్రాలను ఉపయోగించండి. ఇవి చెమటను పీల్చుకోవడానికి మరియు చర్మానికి గాలి సోకడానికి అనుకూలంగా ఉంటాయి. సింథటిక్ తో తయారు చేసిన బట్టలు చెమటను సమర్థవంతంగా గ్రహించి వేడిని నిలుపుకోవడంలో విఫలం కావడం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.
ముదురు రంగులు కలిగినటువంటి దుస్తులు లేదా వస్త్రాలను ధరించవద్దు లేదా వాటిని చాలా పరిమితం చేసుకోండి.
ఐస్ ప్యాక్లను ఉపయోగించటం
మణికట్టు, మెడ, ఛాతీ మరియు కణత భాగం వంటి నిర్దిష్ట శరీర భాగాలపై చల్లటి నీరు లేదా ఐస్ ముక్కలను ఉంచడం ద్వారా సిరల ద్వారా ప్రవహించే రక్తం యొక్క ఉష్ణోగ్రతను వేగంగా తగ్గించడానికి సాధ్యమవుతుంది. ఇవి శరీరం చాలా వేడిని విడుదల చేసే ప్రాంతాలు మరియు సిరలు చర్మం యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి.
ఇలా చేయటం రక్తం మరియు ప్రసరణ వ్యవస్థకు సులభంగా అనుసంధానాన్ని అందిస్తాయి మరియు చల్లదనం యొక్క అనుభూతిని పొందటాన్ని వేగవంతం చేస్తాయి.
అదేవిధంగా, మెడ మరియు వెనుక భాగంలో ఐస్ ప్యాక్లను ఉంచండి - లేదా, మరింత ఖచ్చితంగా చెప్పాలి అంటే, మెడ వెనుక గుండా వెళ్ళే మెదడు కాండం. ఇది శరీర ఉష్ణోగ్రతను గ్రహించి నియంత్రించే మెదడు యొక్క ప్రాంతం. ఒక కోల్డ్ ప్రెస్ శరీరం అంతటా చల్లదనాన్ని పొందిన అనుభూతిని వేగవంతం చేస్తుంది.
చల్లటి టీని తాగండి
ఒక చల్లని మరియు గ్లాసుడు చల్లటి ఐస్ టీ నిస్సందేహంగా దాహాన్ని తీర్చడానికి మరియు ఒక వ్యక్తి శరీరాన్ని చల్లగా ఉంచడానికి అనువైన ఎంపికగా చెప్పవచ్చు.
ఐస్ టీ అనేది ఒక రకమైన కోల్డ్ టీ, దీనిని సాధారణంగా ఐస్ క్యూబ్స్, తేలికపాటి టీ డికాషన్ తో నింపిన గ్లాసులో సర్వ్ చేస్తారు, ఇది మన భారతీయ వేసవి వేడిలో దాహాన్ని తీర్చడానికి తేనె మరియు నిమ్మకాయను కలిపి తీసుకుంటే మంచి రుచితో తియ్యగా ఉంటుంది.
గడ్డ కట్టిన ఐస్ ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. ఐస్ టీ ని సరైన రుచి మరియు చిక్కదనంతో తయారు చేయడానికి ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. వేడినీటిలో కొన్ని టీ ఆకులను జోడించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. కొన్ని తాజా పుదీనా ఆకులు, సన్నగా రౌండ్ గా కట్ చేసిన నిమ్మకాయలు, నిమ్మరసం మరియు కొంత తేనెను జోడించడం వల్ల ఆశ్చర్యకరమైన రుచి వస్తుంది.
నిమ్మరసం కలపడం ద్వారా ఐస్ టీ పోషకాలతో పాటు మరియు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ పరిపూర్ణ పానీయం చల్లదనపు లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది శరీర వేడిని తగ్గించడానికి అనువైనదిగా పని చేస్తుంది.
ముగింపు
విపరీతమైన ఉష్ణోగ్రత శరీరంలో వేడిని పెంచుతుంది. శరీర వేడిని తగ్గించడం అనేది హైడ్రేటెడ్ గా ఉన్న ఆహారాలను తీసుకోవడం అలాగే శరీరాన్ని బాహ్యంగా మరియు అంతర్గతంగా జాగ్రత్తగా చూసుకోవటం పైన ఆధారపడి ఉంటుంది.
అత్యంత చల్లదనాన్ని కలిగించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఈ బ్లాగ్ వివరించింది. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగించవు, కానీ కొన్ని సంవత్సరంలో వేసవి కాలంలో చల్లగా ఉండటానికి మనం తినేటటువంటి ఆహారాలను తీసుకోవటానికి మళ్ళీ ఒకసారి ఆలోచింపచేస్తాయి. అయినప్పటికీ, చల్లగా ఉండటానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి తగినంత నీరు త్రాగటం అని గుర్తుంచుకోవడం ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైనది.