జుట్టు, చర్మం లేదా గోళ్లపై ఏర్పడేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు

జుట్టు, చర్మం లేదా గోళ్లపై ఏర్పడేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు

Health Insurance Plans Starts at Rs.44/day*

*I hereby authorise Star Health Insurance to contact me. It will override my registry on the NCPR.

Verified By Star Health Doctors  

Verified By Star Health Doctors
Health & Wellness

జుట్టు, చర్మం లేదా గోళ్లపై ఏర్పడేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు

పరిచయం:

ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేసే ఒక సాధారణ సంఘటన. ఇవి చర్మం, వెంట్రుకలు మరియు గోళ్లతో సహా శరీరంలోని వివిధ భాగాలపై కనిపిస్తూ ఉంటాయి, చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే అవి అసౌకర్యంగా ఉండటం  మరియు కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీయటం వంటివి  జరుగుతుంది. ఈ వ్యాసంలో, వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు అవి సంభవించటానికి గల కారణాలు మరియు వాటిని నయం చేసేటటువంటి మార్గాలను మనము ఇక్కడ చూద్దాము.

ఫంగస్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

శిలీంధ్రాలు వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణంలో అభివృద్ధి చెందే సూక్ష్మ జీవులు. ఉదాహరణకు, మనం ఆహారంలో తీసుకునే పుట్టగొడుగులు నిజానికి శిలీంధ్రాలే! అయితే తేడా ఏమిటంటే పుట్టగొడుగులు మైక్రోస్కోపిక్ కాదు మరియు అవి తినడానికి సిఫారసు చేయబడినవి. కానీ ఇక్కడ మైక్రోస్కోపిక్ శిలీంధ్రాలు హానికరమైనవి మరియు ఇవి మన శరీరం యొక్క ఉపరితలంపైన విస్తరించినప్పుడు అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇవి ఎరుపు రంగులో ఉండి, దురదను కలిగించి, చర్మంపై పొలుసులు మరియు అసౌకర్యంగా ఉండటం  వంటి వివిధ లక్షణాలకు దారితీయవచ్చు. మన జీవితంలో చాలాసార్లు ఈ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటూ ఉంటాము. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు ఎక్కువగా ఇది సోకుతుంది. చర్మం (రింగ్వార్మ్ లేదా అథ్లెట్స్ ఫుట్ వంటివి), వెంట్రుకలు (స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు వంటివి) మరియు గోళ్లు (ఫలితంగా ఒనికోమైకోసిస్ వంటి పరిస్థితులు) సహా శరీరంలోని వివిధ భాగాలపై ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్లలో ఉన్నటువంటి రకాలు

చర్మంపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు

  • రింగ్‌వార్మ్ (Tinea corporis):

రింగ్‌వార్మ్ చర్మంపై ఎరుపు రంగులో ఉండి, దురదను కలిగిస్తూ మరియు చర్మంపై పొలుసుల వంటి పాచెస్‌తో కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రభావిత ప్రాంతం ఒక స్పష్టమైన కేంద్రంతో రింగ్ ఆకారపు దద్దుర్లతో ఏర్పడుతుంది. ఈ అంటువ్యాధి చాలా వరకు చర్మంపైన  (టినియా కాపిటిస్), గజ్జల ప్రాంతంలో (టినియా క్రూరిస్) మరియు పాదాలతో (టినియా పెడిస్) సహా శరీరంలో ఎక్కడైనా కూడా సంభవించవచ్చు.

రోగనిర్ధారణ చేసుకోవటం కోసం దీని రింగ్ ఆకారపు దద్దుర్లు సాధారణంగా సరిపోతాయి. ఇది శరీరంపై విస్తరించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది  మరియు బహుళ వలయాలకు కూడా కారణం కావచ్చు.

  • అథ్లెట్స్ ఫుట్ (Tinea pedis):

అథ్లెట్స్ ఫుట్ కాలి వేళ్ళ మధ్యలో, పాదాలపైన మరియు అరికాళ్ళ యొక్క చర్మంపైన ఇది ప్రభావం చూపుతుంది, దీని వలన దురదలు రావటం, మంట పుట్టడం, ఎరుపు రంగును కలిగి ఉండటం మరియు పగుళ్లుతో ఇవి ఏర్పడతాయి. పొక్కులు మరియు చర్మంపై పొట్టుతో  కూడా ఇవి సంభవించవచ్చు.

దీని వల్ల కాలి వేళ్ల మధ్య మరియు అరికాళ్లపై ఉన్నటువంటి చర్మం దురదను కలిగి ఉంటుంది, ఈ సందర్భంలో పగుళ్లు సర్వ సాధారణ సంకేతాలు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్ళకు కూడా వ్యాపించవచ్చు.

  • జాక్ ఇచ్ (Tinea cruris):

జాక్ దురద గజ్జల ప్రాంతాన్ని ప్రభావితం చేసేటటువంటి ఇన్ఫెక్షన్గా చెప్పాలి, దీనిని బాగా చెప్పాలి అంటే అంచులు దట్టమైన ఎరుపు రంగుతో, దురదను కలిగినటువంటి దద్దుర్లుతో  ఏర్పడతాయి. ఇది లోపలి తొడలు మరియు పిరుదులకు కూడా వ్యాపించవచ్చు, ఇది అసౌకర్యం మరియు చికాకును కూడా కలిగిస్తుంది.

దురద మరియు ఎరుపు రంగుతో గజ్జల ప్రాంతంలో ఏర్పడే దద్దుర్లు విలక్షణమైనవిగా ఉంటాయి. ఇది చెమట పట్టడం వల్ల లేదా రాపిడి జరగటం వల్ల మరింత తీవ్రతరం అవుతాయి.

జుట్టులో ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు

  • టినియా కాపిటిస్ (Tinea Capitis):

టినియా కాపిటిస్ అనేది జుట్టు యొక్క చర్మంపై ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది, ఇది జుట్టు రాలడం, చర్మం పొలుసులుగా మారటం, దురదను కలిగించటం, కొన్నిసార్లు నొప్పితో కూడిన మరియు ఎర్రబడిన చర్మ ప్రాంతాలకు కారణం అవుతుంది.

బట్టతలపై పాచెస్, స్కేలింగ్ మరియు చిట్లిపోయిన వెంట్రుకలు దీనికి సాధారణ సంకేతాలు. కొన్నిసార్లు, నలుపు రంగులో మచ్చలు (జుట్టు కుదుళ్ళు మరియు కొనలు చిట్లడం) వంటివి కనిపించవచ్చు.

  • ఫోలిక్యులిటిస్:

ఫోలిక్యులిటిస్ అనేది జుట్టు యొక్క కుదుళ్లకు సోకేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇది తలపై లేదా శరీరంలోని ఇతర భాగాలపై ఎరుపు రంగు, ఎర్రబడిన గడ్డలు లేదా చీముతో కూడిన గడ్డలకు  దారితీస్తుంది. ఇది దురద లేదా నొప్పిని కలిగి ఉంటుంది.

జుట్టు కుదుళ్ళు చుట్టూ ఉన్న చిన్న చిన్న ఎర్రటి గడ్డలు లేదా చీము గడ్డలు సాధారణమైనవి. ప్రభావిత ప్రాంతం మృదువుగా ఉండటం లేదా పుండును కలిగి ఉండవచ్చు.

గోళ్ళల్లో ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు

  • ఒనికోమైకోసిస్:

ఒనికోమైకోసిస్ అనేది గోళ్ళల్లో ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇది తరచుగా గోర్లు గట్టిపడటం, గొర్ల యొక్క రంగు మారడం (పసుపు రంగులోకి మారడం లేదా తెల్లబడటం) మరియు గోర్లు విరిగిపోవడానికి కారణమవుతుంది. ఇది గోటి చర్మం నుండి గోరును వేరు చేయడానికి కూడా దారితీయవచ్చు.

మందపాటి సున్నితమైన ఆకారంతో పాటు రంగు మారిన గోర్లను కలిగి ఉండటం  సాధారణంగా వీటి యొక్క సంకేతాలు. కొన్ని తీవ్రమైన సందర్భాలల్లో, గోర్లు వంకరగాను లేదా దుర్వాసనను కలిగి ఉండవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్ల యొక్క కారణాలు

ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా డెర్మటోఫైట్స్, ఈస్ట్‌లు మరియు బూజు లతో సహా వివిధ రకాల శిలీంధ్రాల వల్ల సంభవిస్తాయి. అయితే, ఈ శిలీంధ్రాలతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, ఇతర కారకాలు కూడా ఈ క్రింది విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించటానికి దోహదం చేస్తాయి.

1. ప్రత్యక్షంగా శిలీంద్రాలతో పరస్పర చర్యలు :

  • డెర్మటోఫైట్స్ :

ఈ శిలీంధ్రాలు మానవులలో సంబవించేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అత్యంత సాధారణమైన కారణం, ముఖ్యంగా ఇవి చర్మం, జుట్టు మరియు గోళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ట్రైకోఫైటన్, మైక్రోస్పోరమ్ మరియు ఎపిడెర్మోఫైటన్ వంటి జాతులు ఉన్నాయి.

  • ఈస్ట్‌ :

కాండిడా జాతికి చెందినటువంటి కొన్ని ఈస్ట్‌లు నోరు (ఓరల్ త్రష్), యోని (యోని ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు) మరియు చర్మంపై ఉన్న మడతలు (ఇంటర్ట్రిగో) తో సహా శరీరంలోని తేమతో కూడిన అన్ని ప్రదేశాలు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.

  • బూజు :

ఇది సాధారణంగా తక్కువగా ఉన్నప్పటికీ, ఆస్పెర్గిల్స్ లేదా ఫుస్సరియం (Aspergillus or Fusarium) జాతికి చెందిన బూజు వంటి అంటువ్యాధులకు కారణమవుతుంది, ముఖ్యంగా ఇది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉన్న వ్యక్తులలో కనిపిస్తుంది.

2. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి లేదా ఉపరితలంతో ప్రత్యక్ష పరిచయం :

ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి లేదా ఉపరితలంతో ప్రత్యక్షంగా సంబంధం ఉండటం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. తువ్వాలు, రేజర్లు లేదా దుస్తులు వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి.

3. పరిశుభ్రత సరిగా లేకపోవటం :

తరచుగా స్నానం చేయడం లేదా స్నానం చేసిన తర్వాత సరిగా శరీరాన్ని ఆరబెట్టకపోవడం వంటి సరిపడని పరిశుభ్రత పద్ధతులు ఫంగల్ ఇన్ఫెక్షన్ల యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ శిలీంధ్రాలు అపరిశుభ్రమైన మరియు తేమతో కూడిన పరిసరాలలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి.

4. వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం :

తువ్వాలు, రేజర్లు లేదా దుస్తులు వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం వల్ల ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, అటువంటి వ్యక్తుల నుండి వస్తువులను పంచుకోకుండా ఉండటం చాలా మంచిది.

5. చెమట లేదా తడి చర్మం :

విపరీతమైన చెమటను కలిగి ఉండటం, ముఖ్యంగా వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాలలో, చెమట లేదా తడిగా ఉన్న చర్మానికి దారి తీస్తుంది, ఇది శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అథ్లెట్స్ ఫుట్ మరియు జోక్ వంటి ఇన్ఫెక్షన్లు, దురదలు చెమటతో కూడిన చర్మం ద్వారా తీవ్రతరం అయ్యే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు సాధారణ ఉదాహరణలుగా చెప్పవచ్చు.

6. వెచ్చని, తేమతో కూడిన వాతావరణాలు :

శిలీంధ్రాలు వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి, చర్మపు మడతలు, చెమటతో కూడిన పాదాలు మరియు తడిగా ఉన్న బూట్లు వంటి ప్రాంతాలను వాటి సంతానోత్పత్తికి అనువైన ప్రదేశాలుగా ఎంచుకుంటాయి. తేమ ఎక్కువసేపు శరీరంపై ఉండటం వలన శిలీంధ్రాల పెరుగుదల మరియు సంక్రమణకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించ బడుతుంది.

7. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ : 

రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, అంతర్లీన వైద్య పరిస్థితులను (HIV/AIDS లేదా మధుమేహం వంటివి) కలిగి ఉన్నప్పుడు లేదా రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను వాడుతున్నప్పుడు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లకు గ్రహణశీలతను పెంచుతాయి. తద్వారా శిలీంధ్ర వ్యాధికారక క్రిములతో పోరాడే శరీర సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా అంటువ్యాధులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు చికిత్స చేయడం మరింత కష్టంగా మారుతుంది.

8. బిగుతుగా ఉన్న లేదా ఊపిరి ఆడని దుస్తులను ధరించడం :

బిగుతుగా ఉన్న దుస్తులు మరియు ఊపిరి పీల్చుకోలేని బట్టలను ధరించటం వల్ల అవి చర్మంపై తేమను పీల్చుకోకుండా అలాగే నిలుపుతాయి, శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. శారీరకంగా శ్రమించే సమయంలో ధరించే లోదుస్తులు, సాక్స్ మరియు అథ్లెటిక్ దుస్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.

చికిత్సలో ఎంపికలు :

ఇంటి నివారణ చర్యలు :

1. టీ ట్రీ ఆయిల్ :

టీ ట్రీ ఆయిల్‌లో టెర్పినెన్-4-ఓల్ మరియు ఇతర సమ్మేళనాలతో శక్తివంతమైన యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శిలీంధ్ర కణ త్వచాలకు అంతరాయం కలిగించి వాటి పెరుగుదల మరియు వాపును తగ్గిస్తుంది. ప్రతి రోజు అనేకమార్లు ప్రభావిత ప్రాంతాలకు పలుచగా చేసి నేరుగా పూయండి.

2. యాపిల్ సైడర్ వెనిగర్తో తడపడం :

ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క ఎసిటిక్ యాసిడ్ శిలీంధ్రాలకు సరిపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించడానికి ప్రభావిత ప్రాంతాలను ఈ పలుచని ద్రావణంలో నానబెట్టండి.  ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు 15-20 నిమిషాలు ఆపిల్ సైడర్ వెనిగర్లో నానబెట్టండి.

3. కొబ్బరి నూనే :

కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండే లారిక్ యాసిడ్ వంటి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది శిలీంధ్ర కణ త్వచాలకు అంతరాయం కలిగిస్తుంది మరియు వాటి పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి కొబ్బరి నూనెను నేరుగా  ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ప్రతిరోజూ అనేక సార్లు దీనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి.

ఓవర్-ది-కౌంటర్ (OTC) మందులు :

1. యాంటీ ఫంగల్ క్రీమ్‌లు/ఆయింట్మెంట్లు :

క్లోట్రిమజోల్, మైకోనజోల్ లేదా టెర్బినాఫైన్ ఫంగల్ సెల్ మెమ్బ్రేన్ సింథేసిస్ ను నిరోధిస్తుంది, ఇది కణాల యొక్క మరణానికి దారితీస్తుంది. లేబుల్ పై సూచించిన సూచనలను అనుసరించి,  ఇన్ఫెక్షన్ సోకిన చర్మం/గోళ్లకు నేరుగా పలుచని పొరలాగా అప్లై చేయండి.

2. యాంటీ ఫంగల్ షాంపూలు :

కెటోకానజోల్ లేదా సెలీనియం సల్ఫైడ్ షాంపూలు శిలీంధ్ర కణ త్వచాలకు అంతరాయం కలిగిస్తాయి మరియు వాటి ప్రతిరూపాలను నిరోధిస్తాయి. తడి జుట్టు మరియు తల చర్మంపై  షాంపూను అప్లై చేసి 5-10 నిమిషాలు వదిలేయండి, తర్వాత పూర్తిగా శుభ్రం చేయండి. లేబుల్‌పై సూచించిన విధంగా క్రమం తప్పకుండా ఉపయోగించండి.

3. యాంటీ ఫంగల్ స్ప్రేలు :

యాంటీ ఫంగల్ స్ప్రేలు టోల్నాఫ్టేట్ లేదా అన్‌డెసైలెనిక్ యాసిడ్ వంటి క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తాయి మరియు దురద నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రభావిత ప్రాంతాలపై నేరుగా దీనిని స్ప్రే చేయండి, పూర్తిగా పట్టించినట్టు నిర్ధారించుకోండి. ప్రోడక్ట్ లేబుల్‌పై నిర్దేశించిన విధంగా దీనిని ఉపయోగించండి.

వైద్య దృష్టికి ఎప్పుడు తీసుకువెళ్లాలి :

అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఇంటి నివారణ లేదా ఓవర్ ది కౌంటర్ మందులతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. కానీ, కొన్ని తీవ్రమైన లక్షణాలు వైద్య సంరక్షణ యొక్క అవసరాన్ని సూచిస్తాయి :

  • చికిత్స ఉన్నప్పటికీ తీవ్రమైన లేదా నిరంతర లక్షణాలను కలిగి ఉండటం
  • ఇంకొక ఇన్ఫెక్షన్ సంక్రమణ సంకేతాలు ఉండటం (ఉదా, చీము, పెరిగిన నొప్పి లేదా ఎర్రగా మారటం)
  • ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించటం
  • జ్వరం లేదా ఇతర శారీరక లక్షణాలు
  • రాజీపడిన రోగనిరోధక వ్యవస్థ

ముగింపు :

ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చర్మం, జుట్టు మరియు గోళ్లను ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. ఇది అసౌకర్యంగా మరియు వికారంగా ఉన్నప్పటికీ, ఇంటిలో చేసే నివారణ చర్యలు లేదా ఓవర్ ది కౌంటర్ మందులతో సత్వర చికిత్స చేసి  తరచుగా ఏర్పడే సంక్రమణను అరికట్టవచ్చు. అయినప్పటికీ, కొన్ని కష్టమైనా పరిస్థితులలో వీటిని నివారించడానికి వైద్య సహాయం అవసరమైనప్పుడు, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడానికి వెనుకాడకూడదు.

తరచుగా అడిగే ప్రశ్నలు 

1. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఎంత సమయం పడుతుంది?

వ్యాపించిన ఇంఫెక్షన్ యొక్క రకం మరియు తీవ్రతను ఆధారంగా చేసుకుని చికిత్సా సమయం మారుతూ ఉంటుంది. తేలికపాటి కేసులు కొన్ని వారాలలో పరిష్కరించబడతాయి, అయితే కొన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు చాలా నెలలు కూడా పట్టవచ్చు.

2. పుట్టగొడుగులను తినడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయా?

పుట్టగొడుగులను తినడం ద్వారా సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేయదు. అయినప్పటికీ, ఫంగల్ అలెర్జీలు లేదా శరీర సున్నితత్వం కలిగిన వ్యక్తులకు ఇది తీవ్రతరం కావచ్చు.

3. ఫంగల్ ఇన్ఫెక్షన్ సమయంలో ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి?

చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను నివారించండి, ఎందుకంటే ఇవి శిలీంద్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఆల్కహాల్ మరియు అధికంగా  ఈస్ట్ ఉన్న ఆహారాలను పరిమితం చేయండి. సంపూర్ణ పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని ఎంచుకోండి.

4. గోకడం అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్‌లను మరింత తీవ్రతరం చేస్తుందా?

గోకడం వలన ఇన్ఫెక్షన్ చికాకును కలిగిస్తుంది మరియు వ్యాప్తి చెందుతుంది, ఇది మరింత అసౌకర్యాన్ని కలిగించి సంభావ్య సమస్యలకు దారితీస్తుంది.

5. ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్లీ ఎందుకు వస్తుంది?

అసంపూర్తిగా ఉన్న చికిత్స వల్ల, కలుషితమైన వస్తువుల నుండి మళ్లీ ఇన్ఫెక్షన్ సోకటం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లేదా మధుమేహం వంటి అంతర్లీన వైద్య పరిస్థితుల కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు పునరావృతమవుతాయి.

6. ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలను నయం చేయవచ్చా?

అవును, హైపర్ పిగ్మెంటేషన్ అని పిలువబడే ఫంగల్ ఇన్ఫెక్షన్‌లతో సంబంధం ఉన్న నల్లటి మచ్చల యొక్క చర్మం తరచుగా సరైన చికిత్స తీసుకోవటం ద్వారా మెరుగుపడుతుంది. అయితే, చర్మం తిరిగి సాధారణ రంగులోకి రావడానికి కొంత సమయం కూడా పట్టవచ్చు.

DISCLAIMER: THIS BLOG/WEBSITE DOES NOT PROVIDE MEDICAL ADVICE

The Information including but not limited to text, graphics, images and other material contained on this blog are intended for education and awareness only. No material on this blog is intended to be a substitute for professional medical help including diagnosis or treatment. It is always advisable to consult medical professional before relying on the content. Neither the Author nor Star Health and Allied Insurance Co. Ltd accepts any responsibility for any potential risk to any visitor/reader.

;