పరిచయం
మీ పిల్లల నాలుక నలుపు లేదా గోధుమ రంగులో వింతగా మారడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు ఇది వెంట్రుకలతో ఉండటం వల్ల మరియు ఇతరులు దీనిని గమనించినప్పుడు ఇబ్బందికరంగా భావించవచ్చు. ఈ పరిస్థితిని నల్ల నాలుక అని పిలుస్తారు, ఇది తాత్కాలికంగా ఏర్పడే నోటి పరిస్థితి. ఇది గుర్తించదగినది కాని ప్రమాదకరం కాదు. నల్ల నాలుక అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, దీనిని నిర్వహించే మార్గాలు మరియు దీని గురించి అనేక ఉపయోగకరమైన సమాచారాలను ఇక్కడ మనము పరిశీలిద్దాం.
నల్ల నాలుక!
నల్ల నాలుక, నల్లటి వెంట్రుకల నాలుక అని కూడా దీనిని పిలుస్తారు, ఇది నాలుక నల్లబడటం లేదా రంగు మారడం ద్వారా వర్గీకరించబడినటువంటి ఒక పరిస్థితి. నాలుక రంగు మారడం ఇది సాధారణంగా నలుపు రంగు, గోధుమరంగు, పసుపు లేదా ఆకుపచ్చ వంటి రంగులలో ఉండవచ్చు. పేరు వినటానికి భయంకరంగా అనిపించినప్పటికీ, నల్ల నాలుక సాధారణంగా తాత్కాలికమైనది మరియు తీవ్రమైన ఆందోళనకు కారణం కాదు. ఇది సాధారణంగా నాలుక ఉపరితలంపై ప్రోటీన్ కెరాటిన్ పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది.
మీ పిల్లల నాలుకలో ఏర్పడేటటువంటి ఈ మార్పులను గమనించండి :
- తేలికపాటి గులాబీ రంగుకు బదులుగా, నాలుక ముదురు రంగు, నలుపు రంగు, గోధుమ రంగు, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో కనిపించవచ్చు. రంగు మారడం సాధారణంగా నాలుక ఉపరితలంపై మాత్రమే పరిమితం చేయబడుతుంది మరియు వీటి తీవ్రతలో మార్పు కూడా ఉండవచ్చు.
- కొన్ని సందర్భాలలో, నాలుక జుట్టు లేదా వెంట్రుకల ఆకృతిని కలిగి ఉంటుంది. దీని ప్రధాన లక్షణం నాలుక ఉపరితలంపై ఉండే ఫిలిఫారమ్ పాపిల్లే (filiform papillae) యొక్క పొడవైన దారం వంటి మచ్చ లాగా ఏర్పడిన ఆకృతిని కలిగి ఉండటం.
- నాలుక యొక్క ఉపరితలంపై మందపాటి పూత లేదా శిధిలాల వంటి పొర ఇంకా బ్యాక్టీరియా మరియు మృత కణాల యొక్క పొరను కలిగి ఉండవచ్చు. ఈ పూత నాలుకపైన మందపాటి నలుపు రంగు రూపం ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
- రంగు మారడం సాధారణంగా నాలుక పైభాగంలో మాత్రమే పరిమితం చేయబడుతుంది కానీ మరింత తీవ్రమైన సందర్భాలల్లో నాలుక యొక్క పక్కలకు లేదా వెనుక భాగానికి కూడా విస్తరించవచ్చు.
- నాలుక రంగులోకి మారడంతో పాటు, నలుపు రంగు నాలుకను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు నోటి నుండి దుర్వాసన రావటం, నోరు ఎదో లోహపు రుచిని కలిగి ఉండటం, లేదా నాలుకపైన అసౌకర్యం లేదా మంట వంటి అదనపు లక్షణాలను కూడా అనుభవించవచ్చు.
పిల్లలలో నల్ల నాలుక ఏర్పడటానికి గల కారణాలు :
నల్ల నాలుక, లేదా వెంట్రుకలను కలిగిన నాలుక, ఈ క్రింది కారణాల వల్ల పిల్లలలో కూడా ఏర్పడవచ్చు :
1. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవటం :
నాలుకను సరిగ్గా బ్రష్ చేయకపోవడం లేదా శుభ్రం చేయకపోవడం వల్ల నాలుక యొక్క ఉపరితలంపై బ్యాక్టీరియా, శిధిలాలు మరియు మృతకణాలు పొరలాగా పేరుకుపోతాయి, ఫలితంగా నాలుక నల్లగా మారుతుంది.
2. నోటి అలవాట్లు :
కొంతమంది పిల్లలు నోటితో శ్వాస తీసుకోవడం లేదా నాలుకను నొక్కి పెట్టుకోవటం వంటి నోటికి సంబందించిన అలవాట్లను కలిగి ఉండవచ్చు, ఇది నాలుక ఉపరితలంపై కణాలను సహజంగా శుభ్రపరచడం మరియు తొలగించడాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది నల్ల నాలుక ఏర్పడటానికి దారితీయవచ్చు.
3. మందుల వాడకం మరియు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు :
యాంటీబయాటిక్స్ వంటివి పిల్లలకు సూచించిన కొన్ని మందులు నోటిలోని బ్యాక్టీరియా యొక్క సహజమైన సమతుల్యతను దెబ్బతీస్తాయి మరియు దుష్ప్రభావంగా నల్లటి నాలుకకు దోహదం చేస్తాయి. అలాగే మధుమేహం, జీర్ణాశయాంతర రుగ్మతలు లేదా రోగనిరోధక వ్యవస్థలో లోపాలు వంటి అంతర్లీన వైద్య పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు పిల్లలలో ఈ నల్ల నాలుక యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి.
4. ఐరన్ సప్లిమెంట్స్ :
ఐరన్ సప్లిమెంట్లను తీసుకునే పిల్లలు, ముఖ్యంగా లిక్విడ్ లేదా సిరప్ రూపంలో తీసుకునేవారు, నాలుకపై ఐరన్ కంటెంట్ మరకలు ఏర్పడటం వల్ల నల్ల నాలుక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
5. ఫంగల్ ఇన్ఫెక్షన్లు :
సాధారణంగా ఇవి పిల్లలలో తక్కువగా ఉంటాయి. అయితే, నోటి థ్రష్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు మరియు నల్ల నాలుక ఏర్పడటానికి కూడా దోహదం చేస్తాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు లేదా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్న పిల్లలలో ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి.
6. ఆహారపు కారకాలు :
కొన్ని రసాలు లేదా క్యాండీలు వంటి ముదురు రంగు ఆహారాలు లేదా పానీయాలను వినియోగించటం ద్వారా నాలుకపై నలుపు వంటి మరకలు ఏర్పడటం మరియు నాలుక రంగు మారడానికి దోహదం చేస్థాయి.
నల్ల నాలుక పిల్లల యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది :
నల్ల నాలుకతో బాధపడుతున్న పిల్లలు తమ నాలుక యొక్క రూపాన్ని గురించి స్వీయ-స్పృహను కలిగి ఉంటారు, ప్రత్యేకించి పాఠశాల లేదా వృత్తిపరమైన సామాజిక పరిస్థితులను కలిగి ఉన్నప్పుడు ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రకమైన ఆందోళన రంగు మారిన రూపాన్ని బట్టి ఇతరుల ద్వారా ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవాలి అన్న ఆందోళనల నుండి ఉత్పన్నమవుతుంది. నల్ల నాలుక తరచుగా హానిచేయనిది మరియు ఇది తాత్కాలికమైనది అని తెలిసినప్పటికీ, పిల్లలు నోటి అపరిశుభ్రత లేదా అనారోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉన్నట్లు గుర్తించబడతారని భయపడటం వల్ల మనోధైర్యాన్ని కోల్పోతారు. ఈ విధమైన అసౌకర్యం వల్ల వారి బావాలాను వ్యక్త పరిచేటప్పుడు వారు విశ్వాసాన్నీ కోల్పోవచ్చు, సంభాషణలలో పాల్గొనడానికి లేదా మాట్లాడటానికి వారిని వెనుకాడేలా చేస్తుంది. ఈ సమస్య యొక్క సవాలును ఎదుర్కోవడంలో వారు ఒంటరిగా లేరని పిల్లలకు భరోసా ఇస్తూనే, వారికి ఏర్పడినటువంటి ఈ ఇబ్బంది మరియు అసౌకర్య భావాలను గుర్తించడం చాలా అవసరం. తద్వారా పిల్లలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించవచ్చు.
నల్ల నాలుక యొక్క నివారణలు :
1. బ్రష్ చేయడం సరదాగా చేయించండి :
రంగురంగుల టూత్ బ్రష్‌లను ఇవ్వటం ద్వారా మరియు రుచికరమైన టూత్‌పేస్ట్ యొక్క ఫ్లేవర్‌లను ఉపయోగించడం ద్వారా టూత్ బ్రషింగ్ పిల్లలను ఆనందించే విధంగా మార్చండి. మీ పిల్లలను రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకునేలా ప్రోత్సహించండి. ఇలా చేయటం వల్ల పిల్లలకు సరైన నోటి పరిశుభ్రతను కాపాడుకోవడంలో, నాలుక యొక్క ఉపరితలంపై బ్యాక్టీరియా పేరుకుపోకుండా నిరోధించడంలో మరియు నల్ల నాలుక ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.
2. టంగ్ స్క్రాపింగ్ :
నాలుక శుభ్రం చేసుకోవడం అనే ఆలోచనను ఒక ఆహ్లాదకరమైన సాహసంగా మీ పిల్లలకు పరిచయం చేయండి! మీ పిల్లలకు ఇష్టమైన రంగు లేదా వారికి నచ్చే డిజైన్‌లో ఉన్నటువంటి వారి స్వంత నాలుకను శుబ్రపరిచే సాధనాన్ని వారినే ఎంచుకోనివ్వండి. నాలుకపై ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించకుండా లేదా ఎక్కువ వెనుక భాగానికి చేరుకోకుండా సున్నితమైన స్క్రాపింగ్‌ను ఉపయోగించాలి అని నొక్కి చెప్పండి. స్క్రాప్ చేసిన తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవటాన్ని నేర్పించండి మరియు నాలుక స్క్రాపర్‌లను ఇతరులవి వాడటం కానీ, పంచుకోవడం కానీ లేదా ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించకూడదు అని వారికి తెలియచేయండి. ఈ జాగ్రత్తలు పిల్లలకు సురక్షితమైనవిగా మరియు ప్రభావవంతమైనవిగా ఉంటాయి. రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల నాలుకపై ఉండే మృత కణాలు, నాలుకకు అతుక్కుపోయిన పదార్థాలు తొలగిపోతాయి. ఈ అలవాట్లు నాలుకను శుభ్రపరచటమే కాకుండా, నల్ల నాలుక నివారణ మరియు నిర్వహణలో పిల్లలకు సహాయపడతాయి, అంతేకాకుండా ప్రతి రుచిని మరింత ఎక్కువగా, త్వరగా గుర్తించగలుగుతారు.
3. నీరు త్రాగడాన్ని ప్రోత్సహించండి :
నీరు త్రాగడాన్ని సరదాగా చేయడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండడం యొక్క ప్రాముఖ్యతను మీ పిల్లలకు నేర్పించండి. వారికి ఉదాహరణలతో వివరించండి, సరదాగా మీకు మరియు పిల్లలకి మధ్య ఉన్న పోటీని వినోదంగా మార్చుకోండి. రంగురంగుల కొత్త వాటర్ బాటిళ్లతో నీటిని తీసుకోవటం వల్ల వారిలో నీరు త్రాగడానికి ఉత్సాహాన్ని కలిగించండి మరియు వాటి ప్రయోజనాల గురించి వారికి తెలిసేలా వివరించండి. ప్రతిరోజూ తీసుకునే నీటి వినియోగం యొక్క రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు వారిని అభినందించండి. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల లాలాజలం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఇది నోటిని శుభ్రపరచడంలో మరియు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. నోటిలో విషపదార్ధాలు తగ్గి దంతక్షయం వంటి సమస్యలు ఉండవు, మొత్తం నోటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది మరియు నల్ల నాలుక ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. కలర్‌ఫుల్ డైట్‌ని అమలు చేయండి :
మీ పిల్లల యొక్క ఆహారం పండ్లు మరియు కూరగాయలతో అందమైన ఇంద్రధనస్సును పోలిన రంగులతో ఉత్సహాన్ని కలిగించే విధంగా వారికి అందించండి. రంగురంగుల ఆహారాలు తినడానికి పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా, వారి నాలుకను ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లు మరియు పోషకాలను అందించడం ద్వారా నోటికి మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగించవచ్చు. ఆపిల్, క్యారెట్ మరియు సెలెరీ వంటి క్రంచీ పండ్లు అలాగే కూరగాయలు లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించడం ఇంకా నోటిలోని వ్యర్ధ పదార్ధాలను తొలగించడం ద్వారా దంతాలు మరియు నాలుకను శుభ్రపరచడంలో సహాయపడతాయి, ఇంకా నల్ల నాలుక ప్రమాదాన్ని మరింతగా తగ్గిస్తాయి.
5. రుచికరమైన ప్రోబయోటిక్స్ చేర్చండి :
పండ్లు లేదా గ్రానోలా వంటి ఆహ్లాదకరమైన టాపింగ్స్‌తో కూడిన పెరుగు వంటి రుచికరమైన ప్రోబయోటిక్-రిచ్ ఫుడ్‌లను మీ పిల్లల ఆహారంలోకి ప్రవేశపెట్టండి. ఈ ఆహారాలు వారి నోటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఇంకా నల్ల నాలుకను నివారించడంలో ఎలా సహాయపడతాయో వారికి వివరించండి. ప్రోబయోటిక్స్, ఇది ఒక ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, నోటిలోని సూక్ష్మజీవుల సహజ సమతుల్యతను పునరుద్ధరించడం ద్వారా నల్ల నాలుకను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇవి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి, నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడానికి మరియు అంటువ్యాధుల నుండి రక్షించడానికి రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రోబయోటిక్స్ కూడా వాపును తగ్గిస్తుంది మరియు జీర్ణ సంబంధిత ఆరోగ్యానికి మద్దతును కలిగిస్తుంది, ఆహారం జీర్ణమవడం అనేది నోటి నుంచే ప్రారంభమవుతుంది. నోట్లోని లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారాన్ని విడగొట్టి, పేగులలోకి పంపుతాయి. అక్కడ్నుంచి ఆహారం జీర్ణాశయం చేరుకుంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు చాలా ఉపయోగపడుతుంది. పరోక్షంగా నోటి ఆరోగ్యాన్ని మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తద్వారా నల్ల నాలుక ప్రమాదాన్ని నివారిస్తుంది.
వెంటనే వైద్యుడిని సంప్రదించండి
మీ పిల్లవాడు క్రింది పరిస్థితులలో దేనినైనా ఎదురొంటూ ఉంటే :
- స్థిరమైన నోటి పరిశుభ్రత పద్ధతులు మరియు ఇంటి నివారణలు ఉన్నప్పటికీ, నల్ల నాలుక యొక్క నిరంతర లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటాయి.
- నల్ల నాలుక నొప్పి, వాపు, రక్తస్రావం, లేదా ఆహారం మింగడంలో లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలతో కూడి ఉంటుంది.
- కాలక్రమేణా పరిస్థితి మరింత దిగజారినప్పుడు లేదా జ్వరం, అలసట లేదా వివరించలేని విధంగా బరువు తగ్గడం వంటి అదనపు లక్షణాలు సంభవించినప్పుడు.
- మీ పిల్లలు వాడే మందులు నల్ల నాలుక రావడానికి దోహదపడుతున్నాయని మీరు ఆందోళన చెందుతున్నప్పుడు, కొత్త మందులు వాడటం ప్రారంభించిన కొద్దిసేపటికే దానిని అభివృద్ధి చేయడం వంటివి ఉన్నప్పుడు, వారు తీసుకునే మందుల యొక్క మోతాదును సర్దుబాటు చేయాలని లేదా ప్రత్యామ్నాయ మందులకు మారాలని సూచించవచ్చు.
- నల్ల నాలుక వల్ల నిరంతరంగా అసౌకర్యం, ఇబ్బంది లేదా ఆందోళన వంటివి మీ పిల్లల జీవన నాణ్యతను లేదా రోజువారీ కార్యకలాపాలను విపరీతంగా ప్రభావితం చేస్థాయి.
ఆరోగ్య సంరక్షణ నిపుణులు మీ సమస్యలను పరిష్కరించడానికి మీకు మద్దతును, మార్గదర్శకత్వాన్ని మరియు తగిన చికిత్స ఎంపికలను అందించగలరు. మీరు ఆలస్యం చేసే ప్రతి రోజు, మీ పిల్లల మనోధైర్యాన్ని మరింత ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి.
ముగింపు :
నల్ల నాలుక, ఇది మొదట ఆందోళనకరంగా కనిపించినప్పటికీ, చాలా మంది పిల్లలు అనుభవించే తాత్కాలిక మరియు హానిచేయని పరిస్థితిగా చెప్పాలి. తల్లిదండ్రులుగా, మీ అవగాహన మరియు భరోసా మీ పిల్లవాడు ఈ సమస్యను ఎలా గ్రహిస్తున్నాడు మరియు ఎలా దానిని నిర్వహిస్తున్నాడు అనే విషయంలో గణనీయమైన మార్పును కలిగిస్తుంది. నల్ల నాలుక అనేది ఒక సాధారణమైనదిగా వారికి వివరించటం వల్ల వారి మనస్సును తేలిక పరచవచ్చు. ఆరోగ్యకరమైన నోటి పరిశుభ్రత అలవాట్లను వారికీ తెలియచేయటం మరియు బహిరంగ సంభాషణను పెంపొందించడం ద్వారా, మీరు మీ బిడ్డకు వారి మీద వారికి కలిగేటటువంటి సురక్షితమైన నమ్మకాన్ని పెంపొందించటానికి సహాయపడవచ్చు. సానుకూలతతో ఏదైనా ఆరోగ్య సంబంధిత అనుభవం ద్వారా మీ బిడ్డను నావిగేట్ చేయడంలో మీ మద్దతు మరియు మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం.