జుట్టు కోసం బాదం నూనె యొక్క 17 ప్రయోజనాలు

Health Insurance Plans starting at Rs.15/day*

Health Insurance Plans starting at Rs.15/day*

బాదం నూనె అంటే ఏమిటి?

బాదం నూనె పండిన బాదం గింజల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది, సాధారణంగా దీనికోసం తీపి బాదం గింజలను ఉపయోగిస్తారు. బాదం నూనె బాదం గింజలను బాగా చిదమడం ద్వారా తీయబడుతుంది, ఇలా శుద్ధి చేయని బాదం నూనె తయారు చేయబడుతుంది. ఈ ముడి నూనెను పొందిన తరువాత, తయారీదారులు నూనెను వేడి చేసి దానిలో రసాయనాలను కలుపుతారు, ఇప్పుడు ఇది శుద్ధి చేయబడిన బాదం నూనెగా సృష్టించబడుతుంది.

బాదం చెట్టు నుంచి సేకరించిన గింజలను, నూనె తయారీ మిషన్ లో వేసి బాగా  చిదమడం ద్వారా బాదం నూనె లభిస్తుంది. ఇందులో అధిక ప్రోటీన్, ఒమేగా-9 ఫ్యాటీ   ఆసిడ్స్ మరియు విటమిన్ E వంటి మంచి గుణాలు మరియు ఆరోగ్య లక్షణాలను కలిగి ఉండటం వల్ల పురాతన కాలం నుంచి బాదం సమాజంలో విలువైనదిగా పరిగణించబడుతోంది. బాదం నూనె మీ జుట్టుకి మెరుపును ఇచ్చి మరియు బలాన్ని పెంచుతుందని ఈ లక్షణాలు సూచిస్తున్నాయి. బాదం నూనె ఎక్కువగా సిఫార్సు చేయబడిన జుట్టు కి ఉపయోచిందగినటువంటి నూనె.

జుట్టు కోసం బాదం నూనె యొక్క ప్రయోజనాలు

బాదం నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఈక వంటి ఆకృతిని  కలిగి ఉంటుంది, అంటే ఇది చర్మంపై తేలికగా ఉంటుంది. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు మరియు తలపైభాగానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది అనటంలో ఆశ్చర్యం లేదు. ఇది అందించే కొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. మీ జుట్టును మృదువుగా చేస్తుంది

బాదం నూనె మీ జుట్టులో ఉన్నటువంటి ఖాళీలను పూరించగలదు. ఇది మీ జుట్టును మృదువుగా చేయగలదు. జుట్టు కోసం బాదం నూనెను ఉపయోగించడం వల్ల కాలక్రమేణా మృదువైన ఆకృతిని పొందవచ్చు. మీరు క్రమం తప్పకుండా బాదం నూనెను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత జుట్టు మృదువుగా మారుతుంది.

2. బాదం నూనె జుట్టును బలపరుస్తుంది మరియు రిపేర్ చేస్తుంది

జుట్టుకు చికిత్స చేయడానికి కొన్ని రకాల ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా జుట్టు   విరిగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది మరియు చివరి భాగాలు చిట్లించటం వంటి సమస్యను పరిష్కరించవచ్చు. బాదం నూనె వలే, గింజలలోని కొన్ని పోషకాలు హెయిర్ స్టైలింగ్ సమయంలో కలిగించే భాదను తగ్గిస్తాయి. బాదం స్వతహాగా కలిగినటువంటి పోషక గుణాల ద్వారా జుట్టు డ్యామేజ్‌ని కూడా రిపేర్ చేస్తుంది.

3. బాదం నూనెతో మీ జుట్టు పెరుగుతుంది.

జుట్టు రాలడాన్ని అందరూ అసహ్యించుకుంటారు. జుట్టు ఒత్తుగా పెరగడానికి బాదం నూనె ప్రభావవంతంగా ఉంటుందని క్లినికల్ ట్రయల్స్ నిరూపించ బడలేదు. కానీ బాదం నూనె జుట్టును బలంగా చేస్తుంది మరియు చివరలు చిట్లి పోయే అవకాశాలను తగ్గిస్తుంది. బాదం నూనెలో అధిక మొత్తంలో విటమిన్ E ఉంటుంది. బాదంలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టుకు హాని కలిగించే పర్యావరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, మీ జుట్టు తలపై ప్రేరేపిత ప్రాంతంలో బాగా పెరుగుతుంది అంతేకాకుండా  యవ్వనంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

4. బాదం నూనె తలకు పోషణను ఇస్తుంది

బాదం నూనె సెబోరోహెయిక్ డెర్మటైటిస్ మరియు స్కాల్ప్ సోరియాసిస్‌కు చికిత్సగా సూచించబడింది. ఈ వాదనను నిరూపించే అధ్యయనాలు మన వద్ద లేనప్పటికీ, ఇది శతాబ్దాలుగా చైనీస్ మరియు ఆయుర్వేద ఔషధాలలో పొడిబారిన తల యొక్క పైభాగ చర్మంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. కొద్దిగా బాదం నూనెను తీసుకుని నేరుగా మీ తలపై రుద్దడం వల్ల ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది మరియు మీ తలపై చర్మానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్‌లను పరిచయం చేస్తుంది.

5. స్కాల్ప్ యొక్క ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది

బాదం నూనెను జుట్టుకు ఉపయోగించడం వల్ల శిరోజాలు మృదువుగా మారుతాయి. ఇది తలపై చికాకు కలిగించి లేదా డ్యామేజ్ అవ్వటానికి కారణమయ్యే మురికిని తొలగిస్తుంది మరియు మంటను కూడా తగ్గిస్తుంది.

6. వెంట్రుకల చివరలు చిట్లటం

బాదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ రిచ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి జుట్టు చివరి భాగాలు చిట్లించటాన్ని ఎదుర్కోవటానికి మరియు మీ జుట్టు కుదుళ్లను తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి. ఇవి చిట్లించిన చివరలను కత్తిరించే అవసరాన్ని తగ్గిస్థాయి.

7. బలమైన జుట్టు

జుట్టు తక్కువగా రాలడం వలన, జుట్టు యొక్క పరిమాణం బాగా పెరుగుతుంది. బాదం నూనె కూడా వెంట్రుకల కుదుళ్లను బాగా శుభ్రం చేస్తుంది, ఫలితంగా జుట్టు బలంగా ఒత్తుగా తయారవుతుంది.

8. కండీషనర్‌గా ఉపయోగించబడుతుంది

బాదం నూనెలో విటమిన్ E, మినరల్స్ మరియు ఫ్యాటీ  ఆసిడ్స్ ఉంటాయి. కాబట్టి, మీ జుట్టు పొడిగా మరియు నిటారుగా ఉంటే, మీ జుట్టుకు కొద్దిగా బాదం నూనెను రాయండి. ఇది మీకు సహజమైన హెయిర్ కండీషనర్ గా ఉపయోగపడుతుంది.

9. చుండ్రుతో వ్యవహరిస్తుంది

బాదం నూనె తలలోని మురికిని తొలగించడం ద్వారా జుట్టు యొక్క కుదుళ్లకు పోషణను అందిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చుండ్రుని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

10. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

బాదం నూనెలో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. బాదం నూనెను వారానికి రెండుసార్లు తలకు పట్టించటం వల్ల కనిపించే ప్రభావాన్ని మీరే స్వయంగా చూడవచ్చు. అయితే, జుట్టు రాలడం వివిధ కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.

11. బ్లడ్ రొటేషన్ ను మెరుగుపరుస్తుంది

మీ తలకు బాదం నూనెను రాయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, తలపైన బ్లడ్ రొటేషన్ మెరుగుపడుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ ను క్లియర్ చేయటంలో సహాయ పడుతుంది.

12. ఆయిల్ ఉత్పత్తికి చెక్ పెడుతుంది

బాదం నూనె తలపైన ఉన్నటువంటి ఓవర్ యాక్టివ్ ఆయిల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది, గ్రంధులను దాచిపెట్టి తలపై ఉన్నటువంటి నూనెను తగ్గిస్తుంది.

నిస్తేజంగా మరియు పొడిగా ఉన్న జుట్టును ఆరోగ్యవంతం చేస్తుంది

13. జుట్టు యొక్క కాంతిని మరియు ఆకృతిని పెంచుతుంది

బాదం నూనె తలపై ఉన్నటువంటి అదనపు నూనెను మాత్రమే కాకుండా, జుట్టును తేమగా చేస్తుంది, తద్వారా జుట్టు యొక్క కాంతి మరియు ఆకృతిని విస్తృతంగా మెరుగుపరుస్తుంది.

14. శిరోజాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బ్లడ్ రొటేషన్ జరగటం వల్ల సెబోర్హెయిక్ డెర్మటైటిస్ అని పిలువబడే ఫ్లాకీనెస్ మరియు స్కాల్ప్ సోరియాసిస్ వంటి సమస్యలను పరిష్కరించడానికి స్వచ్ఛమైన బాదం నూనె ఒక అద్భుతమైన నివారిణిగా పని చేస్తుంది.

15. జుట్టు యొక్క కాంతి మరియు ఆకృతి

కొబ్బరి నూనె మరియు ఆముదం కంటే తేలికపాటి ఆకృతిని బాదం నూనె కలిగి ఉంటుంది. దీనిని శుభ్రపరచుకోవటం చాలా సులభం మరియు ఇతర నూనెల లాగా కాకుండా జిడ్డు లేకుండా ఉంటుంది.

16. తియ్యటి వాసన

కొన్ని నూనెలు మరియు వాటి ఘాటైన వాసన కారణంగా జుట్టు యొక్క పెరుగుదలను ఆపివేయబడతాయి. బాదం నూనె విషయంలో అలా కాదు. దీని వాసన చాలా మందిని ఆకట్టుకుంటుంది.

17. స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది

జుట్టు కోసం బాదం నూనె జుట్టు యొక్క స్థితిస్థాపకత మరియు దానికి ఉండేటటువంటి పొడిగించే గుణాన్ని పరిపూర్ణం చేయడం ద్వారా పైన పేర్కొన్న ప్రయోజనాలను కొనసాగింపవచ్చు.

బాదం నూనె కాంతిని మరియు నిర్వహణ సామర్ధ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. బాదం నూనె పోషక విలువలను కలిగి ఉంటుంది, పొడి మరియు నిస్తేజమైన జుట్టును తేమగా ఉంచటంలో సహాయపడుతుంది, ఇది మృదువైన మరియు పట్టువంటి జుట్టు యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.

బాదం నూనె యొక్క ఉపయోగాలు

బాదం నూనెను మీ జుట్టుకు నేరుగా పట్టించటం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే, మీరు వివేకవంతంగా జుట్టు యొక్క కాంతిని పెంచుకోవాలనుకుంటే మీ జుట్టు చివరలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. జుట్టు యొక్క చివరి భాగంలో నూనెను పట్టించండి మరియు మీ జుట్టు మీద నూనెను కాసేపు అలాగే వదిలేయండి.

బాదం నూనెను ఒక ప్రయత్నంగా హెయిర్ మాస్క్‌లో భాగం వలె ఉపయోగిస్తారు. రెండు చుక్కల కొబ్బరి నూనెను ఒక భాగం తియ్యటి బాదం నూనెతో  మరియు సున్నితమైన, సహజమైన పోరాట తత్వం కలిగిన  అవోకాడోతో కలపండి. ఈ హెయిర్ మాస్క్‌ని శుభ్రమైన మరియు తడిలేని జుట్టుకి పట్టించండి, ఇప్పుడు 40 నిమిషాలకు పైగా అలాగే ఉంచండి.

ప్రజలు బాదం నూనెను క్యాప్సూల్ లేదా లిక్విడ్ రూపంలో సప్లిమెంట్లుగా ఉపయోగిస్తారు. మీ జుట్టు యొక్క ఆరోగ్యం కోసం బాదం నూనె తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలను నిరూపించడానికి మనకు మరిన్ని అధ్యయనాలు అవసరం అవుతాయి. కానీ ఏవైతే ప్రోటీన్, విటమిన్ E మరియు ఒమేగా-9 ఫ్యాటీ   ఆసిడ్లు తగ్గటం వల్ల పూర్తి ఆరోగ్యం తగ్గిపోతుందో దానికి ఇది సమర్థవంతమైన నివారణను అందిస్తుంది, ఇది మీ మొత్తం ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతుంది. మీరు దాదాపు ఏదైనా ఆరోగ్య మరియు ఆహార దుకాణాల నుంచి బాదం నూనె సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

బాదం నూనెను ఎలా అప్లై చేయాలి

తడి జుట్టు కోసం

బాదం నూనెను తడి జుట్టుకు రాసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్రింద తెలిపిన మార్గాలను అనుసరించండి.

  • మీ జుట్టును తడిపి, విశాలమైన పళ్ళు గల దువ్వెనను ఉపయోగించి దువ్వండి.
  • మీ జుట్టును చిక్కు లేకుండా ఉంచుకుని తర్వాత కాస్త వేడి చేసిన బాదం నూనెను మీ జుట్టుకు బాగా రుద్దండి. మరియు దీనిని తలమొత్తానికి పట్టించండి.
  • నూనె జుట్టు యొక్క మూలాలకు బాగా చేరేలా చూసుకోవాలి.
  • ప్రతి అంగుళానికి నూనె చేరే విధంగా జుట్టును మళ్ళీ దువ్వండి.
  • ఇప్పుడు షవర్ క్యాప్ ను ఉపయోగించండి. కనీసం ఒక గంట పాటు అలాగే ఉంచండి. రాత్రిపూట ఇలా వదిలివేయడం వల్ల ఇది బాగా పని చేస్తుంది.
  • ఇప్పుడు జుట్టుకు ఉన్నటువంటి నూనెను తొలగించడానికి మీ జుట్టును బాగా కడిగేయండి.
  • వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ పద్ధతిని అనుసరించండి.

పొడి జుట్టు కోసం

పొడి జుట్టు కోసం, స్వీట్ బాదం నూనెను కండీషనర్‌గా ఉపయోగించవచ్చు. దీని కొరకు –

  • ముందుగా వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో మీ జుట్టును సున్నితంగా చిక్కు లేకుండా ఉంచుకోండి.
  • మీ అరచేతిలో బాదం నూనె చుక్కలను తీసుకోండి.
  • జుట్టుకి సరి పడే నూనె ఉండేలా చూసుకోండి. లేకపోతే, అది చేతిలో నుంచి జారిపోవచ్చు.
  • మీ తలపై నూనెతో సున్నితంగా రుద్దండి.
  • మీ జుట్టు మూలాల వరకు దీనిని పట్టించండి.
  • ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా మీ జుట్టును స్టైల్ చేసుకోండి.

బాదం నూనె – తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు దానికి ఉన్నటువంటి దుష్ప్రభావాలు

బాదం నూనెను ఎవరైనా వారి చర్మంపై ఉపయోగించడం సురక్షితంగానే ఉంటుంది. గింజల ద్వారా వచ్చే తీవ్రమైన అలెర్జీలు ఉన్న ఎవరైనా వారి జుట్టుపై లేదా వివిధ కారణాల వల్ల బాదం నూనెను ఉపయోగించకూడదు, ఎందుకంటే యాంటీపాథెటిక్ ప్రతిస్పందన బాధాకరమైనదిగా ఉండవచ్చు.

మీ జుట్టు వేడిగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన బాదం నూనెను ఉపయోగించవద్దు. నూనె మీ హెయిర్ ఫోలికల్ చుట్టూ వేడిని పుట్టిస్తుంది మరియు మీ స్కాల్ప్ లేదా వెంట్రుకలను మాడినట్టు చేస్తుంది.

ఇంట్లో బాదం నూనెను ఎలా తయారు చేసుకోవాలి?

కావలసినవి

ముడి బాదం పప్పు – 1 కప్పు

ఆలివ్ నూనె – 1 టేబుల్ స్పూన్

సీసా – 1

పట్టే సమయం

2-3 వారాలు

విధానము

  • బాదంపప్పులను బ్లెండర్‌లో వేయండి. దీన్ని మెత్తటి పేస్ట్‌లా తయారు చేయండి. ఐదు నిమిషాల్లో బ్లెండర్ యొక్క వేగాన్ని 1 నుండి 3కి పెంచండి మళ్ళీ తిరిగి 1కి తగ్గించండి. ఇప్పుడు కాసేపు విశ్రాంతి ఇవ్వండి మరియు ఈ ప్రక్రియను మళ్లీ కొనసాగించండి.
  • పేస్ట్‌ను సీసాలోకి తీసుకుని, ఆలివ్ ఆయిల్ ను దీనికి కలపండి.
  • గది యొక్క ఉష్ణోగ్రతలో 2-3 వారాలు కలత చెందకుండా ఈ మిశ్రమాన్ని కలిగిన సీసాను అలాగే వదిలివేయండి.
  • ఈ మిశ్రమంలో పైకి తేలినటువంటి నూనెను వడకట్టండి.

సారాంశముగా

బాదం చెట్టు యొక్క గింజలను బాగా  చిదమడం ద్వారా బాదం నూనె లభిస్తుంది. బాదం నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం నూనె మీ జుట్టు యొక్క కాంతి మరియు బలాన్ని పెంచుతుంది. బాదం నూనె ఎవరైనా వారి చర్మంపై ఉపయోగించడం సురక్షితంగానే ఉంటుంది. గింజలతో తీవ్రమైన అలెర్జీలు ఉన్న వారు ఎవరైనా వారి జుట్టుపై లేదా వివిధ కారణాల వల్ల బాదం నూనెను ఉపయోగించకూడదు, ఎందుకంటే యాంటీపాథెటిక్ ప్రతిస్పందన బాధాకరమైనదిగా మారవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

బాదం నూనెను నేరుగా జుట్టుకు రాసుకోవచ్చా?

సాధారణంగా బాదం నూనెను జుట్టుకు పట్టించడం సురక్షితంగానే ఉంటుంది. జుట్టు యొక్క కుదుళ్లకు ఈ నూనెను బాగా మర్దన చేయండి మరియు ఉత్తమ ఫలితాల కోసం మీ జుట్టుపై అలాగే నూనెను వదిలివేయండి.

బాదం నూనె జుట్టు యొక్క పెరుగుదలను పెంచుతుందా?

బాదం నూనెను తరచుగా వాడడం ద్వారా జుట్టు పెరుగుదలను సులభతరం చేసుకోవచ్చు. ఇది ఫ్యాటీ  ఆసిడ్స్, ఆంటీఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లను జుట్టుకు అందిస్తుంది, ఇది ఒత్తిడిని తగ్గించి మరియు పొడిజుట్టుని నివారిస్తుంది, జుట్టు యొక్క పెరుగుదలను పెంచుతుంది.

నేను బాదం నూనెతో కొబ్బరి నూనెను కలపవచ్చా?

బాదం నూనె మరియు కొబ్బరి నూనెను చిన్న మొత్తంలో తీసుకుని బాగా కలిపి తలపైభాగానికి పట్టించటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా వివిధ జుట్టు సమస్యలకు చికిత్సను కూడా చేయవచ్చు.


DISCLAIMER: THIS BLOG/WEBSITE DOES NOT PROVIDE MEDICAL ADVICE

The Information including but not limited to text, graphics, images and other material contained on this blog are intended for education and awareness only. No material on this blog is intended to be a substitute for professional medical help including diagnosis or treatment. It is always advisable to consult medical professional before relying on the content. Neither the Author nor Star Health and Allied Insurance Co. Ltd accepts any responsibility for any potential risk to any visitor/reader.

Scroll to Top