అసిడిటీ అంటే ఏమిటి, దానికి గల కారణాలు, లక్షణాలు మరియు చికిత్సలతో సహా తెలుసుకోండి

Health Insurance Plans starting at Rs.15/day*

Health Insurance Plans starting at Rs.15/day*

పరిచయం:

ప్రపంచవ్యాప్తంగా ఆడ, మగా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి కొందరికి ఛాతీలో మండుతున్న అనుభూతి కలిగి అది చల్లారడానికి నిరాకరించిన అగ్నిలాగా స్థిరమైన తోడుగా ఉంటుంది, కానీ ఈ అసౌకర్యానికి గల కారణం ఏమిటి?

ఇది మరింత తీవ్రమైనదానికి సంకేతమా లేకపోతే నయం చేయగల హానికరం కాని పరిస్థితి అనుకోవచ్చా? వీటన్నిటికీ సమాధానాల కోసం శోధించినప్పుడు, కడుపులో ఏర్పడినటువంటి మనకు తెలిసిన సమస్య – అసిడిటీ!

ఎసిడిటీ అనేది చాలా మంది వ్యక్తులను ప్రభావితం చేసే విస్తృతమైనటువంటి ఆరోగ్య సమస్యగా ప్రస్తుత కాలంలో చెప్పవచ్చు. ఇది కడుపులో ఆమ్లం యొక్క అధిక ఉత్పత్తి ద్వారా వర్గీకరించబడిన పరిస్థితిగా చెప్పవచ్చు, ఇది ఛాతీలో మండే అనుభూతిని మనకు కల్గిస్తుంది.

ఈ పరిస్థితిలో కడుపులోని ఆమ్లం ఆహార పైపులోకి తిరిగి ప్రవహించడం వల్ల ఛాతీ దిగువ భాగంలో నొప్పి లేదా మంటగా ఏర్పడుతుంది. ఇది శరీరం యొక్క సహజ pH స్థాయిలో అసమతుల్యతకు దారితీస్తుంది. ఈ ఆర్టికల్లో, ఎసిడిటీకి గల కారణాలు, వాటి యొక్క లక్షణాలు, చికిత్స యొక్క ఎంపికలు మరియు సరిపడేటటువంటి ఆహారపు సిఫార్సులను మేము ఇక్కడ వివరిస్తాము.

అన్నింటిలోకి మొదటిది, మన శరీరంలో యాసిడ్ ఎలా ఏర్పడుతుంది మరియు అది జీర్ణక్రియలో మనకు ఎలా సహాయపడుతుంది?

  • మనం ఆహారం తిన్నప్పుడు, అది కడుపులోకి వెళుతుంది, అక్కడ అది కడుపు ఆమ్లం అనే ప్రత్యేక ద్రవంతో కలిసిపోతుంది. ఈ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCl), పొటాషియం క్లోరైడ్ (KCl), మరియు సోడియం క్లోరైడ్ (NaCl) వంటి రసాయనాలతో రూపొందించబడి ఉంటుంది. ఈ ఆమ్లం 1.5-3.5 pH స్థాయిని కలిగి ఉంటుంది, ఇది ఎక్కువగా  ఆమ్లసంబంధమైనదిగా  ఉంటుంది.
  • మనం ఆహరం తిన్నప్పుడు, పొట్ట యొక్క లైనింగ్ భాగం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ యాసిడ్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇలా జరిగేలా చేయడానికి కడుపు లైనింగ్‌లో రెండు రకాల కణాలు కలిసి పనిచేస్తాయి అవి ప్యారిటల్ కణాలు మరియు చీఫ్ కణాలుగా చెప్పవచ్చు.
  • ప్యారిటల్ కణాలు కార్బన్ డయాక్సైడ్ (CO2) మరియు నీరు (H2O) నుండి కార్బోనిక్ యాసిడ్ (H2CO3) అనే రసాయనాన్ని తయారు చేస్తాయి. ఈ కార్బోనిక్ ఆసిడ్ పొటాషియం క్లోరైడ్‌తో చర్య జరిపి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని (HCl) ఉత్పత్తి చేస్తుంది, ఇది పొట్టలోని ఆమ్లంలో ప్రధానమైన పదార్ధం.
  • చీఫ్ కణాలు పెప్సినోజెన్ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత అది కడుపులోకి ప్రవేశించినప్పుడు, ఇవి ఎంట్రోక్రోమాఫిన్ (enterochromaffin) లాంటి కణాలు అని పిలువబడే ప్రత్యేక కణాల నుండి గ్యాస్ట్రిన్-విడుదల చేసే పెప్టైడ్ (GRP) అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ GRP ప్యారిటల్ కణాలను కడుపులోకి ఎక్కువ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని (HCl) విడుదల చేయమని చెబుతుంది.
  • HCl పెప్సినోజెన్‌తో కలిసి పెప్సిన్‌ను ఏర్పరుస్తుంది, ఇది ప్రోటీన్ అధికంగా కలిగి ఉండేటటువంటి మాంసం, గుడ్లు మరియు పాల ఉత్పత్తులను చిన్న పెప్టైడ్‌లు మరియు అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేసే క్రియాశీల ఎంజైమ్. ఈ విధమైన ప్రక్రియను ప్రోటీన్ జీర్ణక్రియ అంటారు.
  • పొట్ట ఆమ్లం ప్రోటీన్లను వేడిచేసి ఆమ్లీకరణ ద్వారా సహజలక్షణములను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా వాటిని మరింత సులభంగా చిన్న చిన్న ముక్కలుగా విభజించవచ్చు. ఇలా ఏర్పడిన చిన్న చిన్న ముక్కలు రక్తప్రవాహంలోకి శోషించబడతాయి మరియు అవి అవసరమైన చోట శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళతాయి.
  • కాబట్టి, సులభంగా చెప్పాలంటే, పొట్ట ఆమ్లం ఒక బలమైన శుభ్రపరిచే పరిష్కారం లాంటిది, ఇది మన ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించడంలో సహాయపడుతుంది, మరియు మన శరీరానికి సులభంగా శోషించబడుతుంది అంతేకాకుండా ఇది శరీరానికి చాలా ఉపయోగపడుతుంది .

అసిడిటీకి గల కారణాలు:

ఎసిడిటీకి దోహదపడే అనేక రకాల అంశాలు ఈ క్రింద ఉన్నాయి.

ఆహారం: చక్కెర, ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల అనేక విధాలుగా అసిడిటీకి దోహదం చేస్థాయి. కానీ ఇది ఎలా సాధ్యం?

  • చక్కెర: అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం గట్ మైక్రోబయోమ్‌లో అసమతుల్యతకు దారి తీస్తుంది, ఇది కడుపు యొక్క సహజ pH బ్యాలెన్స్‌కు అంతరాయం కలిగిస్తుంది మరియు కడుపులో యాసిడ్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. చక్కెర పేగులలో చెడు బ్యాక్టీరియా వృద్ధికి కూడా కారణం అవుతుంది, ఇది ఎసిడిటీని తీవ్రతరం చేసే వ్యర్ధపదార్ధాలను ఉత్పత్తి చేస్తుంది.
  • ఉప్పు: ఉప్పు అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం వల్ల రక్తపోటు పెరుగుదలకు కారణం అవుతుంది, ఇది వాపు మరియు యాసిడ్ రిఫ్లక్స్ లకు దారితీస్తుంది. అదనంగా, ఉప్పు కడుపు యొక్క సహజ pH సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇది మరింత ఆమ్లంగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అనారోగ్యపు కొవ్వులు : శాచ్యురేటెడ్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి అనారోగ్యకరమైన కొవ్వులను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల పొట్టలో మంట ఏర్పడుతుంది, ఇది ఎసిడిటీకి దోహదపడుతుంది.

ఒత్తిడి : దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి జీర్ణవ్యవస్థపై దాని ప్రభావం కారణంగా అసిడిటీలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనం అధిక ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరం యొక్క “ఫైట్ లేదా ఫ్లయిట్” ప్రతిస్పందన ప్రేరేపించబడుతుంది, దీని వలన మన జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. ఇది ప్రదానంగా అసిడిటీకి దారితీయవచ్చు:

  • ఆలస్యమైన జీర్ణక్రియ: ఆహారం తీసుకున్నపుడు జీర్ణమవటానికి ఆలస్యం అయినప్పుడు అది కడుపులోనే ఎక్కువసేపు ఉండటం జరుగుతుంది, అప్పుడు కడుపు ఆమ్లం ఆహారాన్ని మరింత తీవ్రంగా విచ్ఛిన్నం చేస్తుంది, కడుపులో ఎసిడిటీ యొక్క అత్యంత ప్రసిద్ధ సంకేతం అజీర్ణం. ఆహార కణాలు పాక్షికంగా లేదా జీర్ణం కానప్పుడు ఇది ఏర్పడటం జరుగుతుంది, ఇది కూడా అసిడిటీకి దారితీస్తుంది.
  • పేగు చలనశీలత తగ్గటం: జీర్ణాశయంలో ఉన్నటువంటి కండరాలు మందగిస్తాయి, ఇలా జరిగినప్పుడు జీర్ణవ్యవస్థ ద్వారా మనం తీసుకున్న ఆహారం పేగులలో మరింత నెమ్మదిగా కదలటం జరుగుతుంది, ఇది కడుపు యొక్క ఉబ్బరం మరియు అసౌకర్యానికి దారితీస్తుంది.
  • పెరిగిన కార్టిసాల్ ఉత్పత్తి: దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒత్తిడి కార్టిసాల్ ఉత్పత్తి యొక్క పెరుగుదలకు కారణం అవుతుంది, ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది, ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.

వ్యాయామం లేకపోవడం: నిశ్చలమైన జీవనశైలి ఈ కింది కారణాల వల్ల అసిడిటీకి  దోహదం చేస్తుంది:

  • పేలవమైన జీర్ణక్రియ: శారీరక శ్రమ లేకపోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది మరియు జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహం కూడా తగ్గుతుంది, ఇది పోషకాల శోషణ మరియు ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది.
  • పెరిగిన కార్టిసాల్ ఉత్పత్తి: నిశ్చలమైన జీవనశైలి తరచుగా పెరిగేటటువంటి కార్టిసాల్ యొక్క ఉత్పత్తితో సంబంధం కలిగి ఉంటుంది, ఇది అసిడిటీకి దోహదం చేస్తుంది.

జన్యుపరమైన వారసత్వం : జీర్ణ ఎంజైమ్‌లు మరియు గట్ బ్యాక్టీరియాలలో వ్యక్తిగత వ్యత్యాసాల కారణంగా అసిడిటీలో వారసత్వం కూడా  ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కొందరు వ్యక్తులు వారి జన్యుపరమైన వారసత్వపు కారణాల వల్ల ఎసిడిటీకి ఎక్కువగా గురవుతూ ఉంటారు.

హార్మోన్ల యొక్క అసమతుల్యత: హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా థైరాయిడ్ యొక్క పనితీరు మరియు ఇన్సులిన్ నిరోధకతకు సంబంధించినవి, అసిడిటీకి దోహదం చేస్తాయి. ఉదాహరణకు:

  • థైరాయిడ్ హార్మోన్ యొక్క అసమతుల్యత: చురుకైనటువంటి థైరాయిడ్ గ్రంధి (hypothyroidism) జీర్ణక్రియ మందగించడానికి మరియు గట్ చలనశీలతను తగ్గిస్తుంది, అయితే అతి చురుకైన థైరాయిడ్ గ్రంధి (hyperthyroidism) పెరిగిన జీవక్రియ మరియు ఆసిడ్ ఉత్పత్తికి కారణం అవుతుంది.
  • ఇన్సులిన్ నిరోధకత: శరీరంలో ఇన్సులిన్ నిరోధకత రక్తంలోని చక్కెర స్థాయిల పెరుగుదలకు దారి తీస్తుంది, ఇది కడుపులో ఆసిడ్ ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తుంది.

అసిడిటీ యొక్క లక్షణాలు:

  • గుండెల్లో మంట: ఛాతీ మరియు గొంతులో మంటగా ఉండటం.
  • రెగ్యురిటేషన్: ఆహారం తిన్న తర్వాత, అది తిరిగి పైకి వస్తున్న అనుభూతి ని కలిగి ఉండటం.
  • బర్పింగ్: త్రేన్పులు అధికంగా రావటం.
  • వికారం: విసుగు లేదా అనారోగ్యాన్ని కలిగి ఉండటం.
  • పొత్తి కడుపులో నొప్పి: ఉదరం పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యంగా ఉండటం.

ఈ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండవచ్చు,  కానీ శరీరంలో అసిడిటీ ఉంటుంది అని చెప్పటానికి కొన్ని సాధారణ సూచికలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

చికిత్సలో ఎంపికలు:

  • అదృష్టవశాత్తూ, ఆహారంలో మార్పులు మరియు జీవనశైలిలో మార్పుల కలయికతో అసిడిటీని నిర్వహించవచ్చు మరియు దీనికి చికిత్స కూడా చేయవచ్చు.
  • టమ్స్, రోలాయిడ్స్ లేదా మైలాంటా (Tums, Rolaids, or Mylanta) వంటి యాంటాసిడ్‌లు అసిడిటీ యొక్క లక్షణాల నుండి త్వరిత ఉపశమనాన్ని అందిస్తాయి.
  • ఒమెప్రజోల్ లేదా లాన్సోప్రజోల్ (omeprazole or lansoprazole) వంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు (PPIలు) యాసిడ్ ఉత్పత్తిని తగ్గించగలవు.
  • రానిటిడిన్ లేదా ఫామోటిడిన్ (ranitidine or famotidine) వంటి హిస్టామిన్-2 (H2) రిసెప్టర్లు అసిడిటీకి వ్యతిరేకమైనవి కూడా యాసిడ్ ఉత్పత్తిని తగ్గించగలవు.
  • ప్రభావిత ఆహారాలను నివారించడం, ఒత్తిడిని తగ్గించడం మరియు వ్యక్తి తన దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి పాటించటం ద్వారా అసిడిటీ యొక్క లక్షణాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.

సిఫార్సు చేయబడిన ఆహార పదార్థాలు:

అసిడిటీ నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని రకాల ఆహారాలు

ఆయుర్వేదంలో, కొన్ని రకాల ఆహారాలు అసిడిటీని తగ్గించడంలో ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. వాటికి ఉదాహరణలు ఈ క్రింద చూడవచ్చు :

  • అరటిపండ్లు- అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది, ఇది కడుపు యొక్క ఆమ్లతను నియంత్రించడంలో సహాయపడుతుంది. పండిన అరటిపండులో సాధారణంగా అధిక పొటాషియం ఉన్నందున ముఖ్యంగా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
  • పెరుగుఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహించే ప్రోబయోటిక్‌లను కలిగి ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ పొట్టలోని ఎసిడిటీని బ్యాలెన్స్ చేస్తుంది.
  • అల్లంజీర్ణవ్యవస్థను శాంతపరిచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది ఎసిడిటీ లక్షణాలను తగ్గించి, నొప్పిని నివారించడంలో సహాయపడుతుంది.
  • ఆకుకూరలు-ఆకుకూరలు యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి, ఇవి మంటను  తగ్గించడంలో మరియు జీర్ణక్రియను ప్రోత్సహించి అసిడిటీని తగ్గించటంలో శరీరానికి సహాయపడతాయి.
  • చేపలు – ముఖ్యంగా సార్డినెస్ మరియు మాకెరెల్ వంటి కొవ్వు కలిగిన చేపలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను  పుష్కలంగా కలిగి ఉంటాయి.

ఎసిడిటీకి దూరంగా ఉండాల్సిన ఆహారాలు

కొన్ని ఆహారాలు అసిడిటీని ప్రేరేపిస్తాయి లేదా మరింత తీవ్రతరం చేస్తాయి. వాటికి ఉదాహరణలు:

  • సిట్రస్ పండ్లు (నిమ్మ, బత్తాయి, లింబు) – అధిక ఆమ్లత్వం కలిగిన పండ్లు అసిడిటీని ప్రేరేపిస్తాయి మరియు కడుపు లైనింగ్‌కు చికాకును కలిగిస్థాయి.
  • టమోటాలువీటిలో ఆమ్లత్వం కూడా ఎక్కువగా ఉంటాయి మరియు అసిడిటీ యొక్క లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
  • చక్కెర కలిగిన పానీయాలుఇవి కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి.
  • ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలుకడుపు లైనింగ్‌కు చికాకును కలిగించే ప్రిజర్వేటివ్స్ లను కలిగి ఉంటాయి.
  • కెఫిన్– ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.

ముగింపు:

ఆహారం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, జన్యుపరమైన మరియు హార్మోన్ల యొక్క అసమతుల్యత వంటి రకరకాల కారకాల కలయిక వల్ల కలిగేటటువంటి అసిడిటీని ఇప్పుడు మనం చూశాము. సాధారణంగా అసిడిటీ యొక్క గుర్తింపు మరియు చికిత్స అనేది సంక్లిష్టమైన ప్రక్రియ కానే కాదు, వాస్తవానికి ఇది సులభంగా గుర్తించదగినది మరియు నయం చేయబడుతుంది కూడా.

అనారోగ్యకరమైన ఆహారపు పద్ధతులు, అధిక ఒత్తిడి మరియు అనారోగ్యకరమైన జీవనశైలి అసిడిటీకి ప్రధాన కారణాలుగా వైద్యులు మరియు పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

అసిడిటీ యొక్క కారణాలు మరియు ఇతర లక్షణాలను అర్థం చేసుకోవడం అంతేకాకుండా ఆహారంలో కొన్ని మార్పులు మరియు జీవనశైలిలో మార్పులను చేయడం ద్వారా, వ్యక్తులు వారి జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని నియంత్రించవచ్చు మరియు అసిడిటీ సంబంధిత సమస్యల యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

తరచుగా అడిగేటటువంటి ప్రశ్నలు

శిశువులు అసిడిటీ బారిన పడతారా? 

అవును, శిశువులు కూడా వారి యొక్క అపరిపక్వ జీర్ణ వ్యవస్థ మరియు ఆహారం కారణంగా అసిడిటీ బారిన పడవచ్చు. యాసిడ్ రిఫ్లక్స్ మరియు గుండెల్లో మంట అనేది వారిలో ఏర్పడే సాధారణ సమస్యలు, ముఖ్యంగా ఫార్ములా-ఫీడ్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ కు సంబందించిన చరిత్ర కలిగి ఉన్నవారిలో గమనించవచ్చు.

అసిడిటీకి చికిత్స చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? 

అసిడిటీకి చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే, అసిడిటీ దంతాలపై ఎనామిల్ కోత, ఆహారం మింగడంలో ఇబ్బంది మరియు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) వంటివి అభివృద్ధి చెందే ప్రమాదపు సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన కొన్ని సందర్భాలలో, ఇది ఏసోఫాగియల్ అల్సర్లు మరియు కుదించుకు పోవటానికి కూడా దారితీస్తుంది.

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి తక్షణ గృహవైద్యం ఏమిటి?

కడుపులోని యాసిడ్‌లను తటస్థీకరించడానికి 1 టీస్పూన్ బేకింగ్ సోడాను నీటితో కలిపి తీసుకోవటం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు దీనిని తక్షణ ఇంటి నివారణగా కూడా  చెప్పవచ్చు. అంతేకాకుండా, యాసిడ్‌లను తటస్థీకరించడంలో సహాయపడటానికి మీరు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం లేదా మెత్తటి అరటిపండు తినడం కూడా చేయవచ్చు.

ఎసిడిటీ కోసం సోడా తాగవచ్చా? 

లేదు, ఎసిడిటీ నుంచి ఉపశమనం కోసం సోడాను తాగడం మంచిది కాదు. సోడా అసిడిటీ యొక్క లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది మరియు మరిన్ని సమస్యలకు కూడా దారితీస్తుంది. దానికి బదులుగా, జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి నీరు లేదా పిప్పరమెంటు లేదా చమోమిలే వంటి హెర్బల్ టీలను ఎంచుకోవటం ఉత్తమం.

అసిడిటీ వల్ల కడుపు ఉబ్బరం వస్తుందా? 

అవును, అసిడిటీ వల్ల కడుపు ఉబ్బరం కలుగుతుంది, ఇది అసౌకర్యం, గ్యాస్ మరియు పొత్తికడుపులో వాపు ద్వారా వర్గీకరించబడుతుంది. ఉబ్బరం అనేది యాసిడ్ రిఫ్లక్స్ లేదా IBS వంటి అంతర్లీన జీర్ణ సమస్యల యొక్క లక్షణం.


DISCLAIMER: THIS BLOG/WEBSITE DOES NOT PROVIDE MEDICAL ADVICE

The Information including but not limited to text, graphics, images and other material contained on this blog are intended for education and awareness only. No material on this blog is intended to be a substitute for professional medical help including diagnosis or treatment. It is always advisable to consult medical professional before relying on the content. Neither the Author nor Star Health and Allied Insurance Co. Ltd accepts any responsibility for any potential risk to any visitor/reader.

Scroll to Top