కడుపులో నొప్పి - వాటిలో రకాలు, వాటి యొక్క లక్షణాలు, వాటికి చికిత్సలు మరియు ప్రమాద కారకాలు

కడుపులో నొప్పి - వాటిలో రకాలు, వాటి యొక్క లక్షణాలు, వాటికి చికిత్సలు మరియు ప్రమాద కారకాలు

Health Insurance Plans Starts at Rs.44/day*

*I hereby authorise Star Health Insurance to contact me. It will override my registry on the NCPR.

Verified By Star Health Doctors  

Verified By Star Health Doctors
Health & Wellness

కడుపులో నొప్పి - వాటిలో రకాలు, వాటి యొక్క లక్షణాలు, వాటికి చికిత్సలు మరియు ప్రమాద కారకాలు

పొత్తికడుపులో నొప్పి అంటే ఏమిటి?

పొత్తికడుపులో నొప్పి అనేది సర్వ సాధారణంగా ఛాతీ మరియు గజ్జల యొక్క మధ్య భాగంలో ఎక్కడైనా సంభవించేటటువంటి నొప్పి. పొత్తి కడుపు నొప్పి అనేది. అనేక సమస్యల్ని సూచిస్తుంది. ఇది వచ్చినప్పుడు సరిగ్గా కూర్చోలేం, నిలబడలేం. అయితే, కడుపులో వచ్చే నొప్పి తీరుని బట్టి ఆరోగ్య సమస్యలను గురించి కూడా చెప్పవచ్చు.

ఇంకో విధంగా చెప్పాలంటే, కడుపులో అసౌకర్యంగాను లేదా ఇతర వికారమైన అనుభూతులను కలిగించే నొప్పిని కడుపు నొప్పిగా సూచిస్తారు. మనలో చాలామంది మన జీవితంలో ఏదో ఒక సమయంలో కడుపులో నొప్పిని అనుభవించి ఉంటారు.

పొత్తికడుపు నొప్పి లేదా పొత్తికడుపు నొప్పి వల్ల ఏర్పడేటటువంటి అనేక సమస్యలకు కడుపులో కలిగే అసౌకర్యపు కేసులను ముందుగానే గుర్తించి వాటికి చికిత్స చేయవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఇది తక్షణం వైద్య చికిత్స అవసరమయ్యే తీవ్రమైన పరిస్థితికి సంకేతం కూడా  కావచ్చు.

కడుపులో నొప్పి వాటిలో ఉన్న రకాలు

రైట్ అప్పర్ క్వాడ్రంట్

ప్యాంక్రియాస్, కాలేయం, పిత్తాశయం, కుడి వైపున ఉన్న మూత్రపిండము మరియు ప్రేగులు అన్నీ కలిపి కుడి పైభాగపు క్వాడ్రంట్‌లో (RUQ) ఉన్నాయి. పక్కటెముకల కింద కలిగేటటువంటి నొప్పి ఈ అవయవాలు లేదా చుట్టుపక్కల కణజాలాలలో ఏదైనా ఒకదానిని ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య వల్ల కడుపులో నొప్పి సంభవించవచ్చు.

లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్

ఎడమ పైభాగపు క్వాడ్రంట్ (LUQ) అనేది నొప్పి సంభవించేటటువంటి పొత్తికడుపు యొక్క ఎడమ వైపున ఉన్న పొత్తికడుపు ప్రాంతం. మీ ఎడమ ఎగువ క్వాడ్రంట్ అనేది మీ ఎడమ వైపున ఉన్న పక్కటెముకలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో పావుభాగం.

రైట్ లోయర్ క్వాడ్రంట్

కుడి దిగువ క్వాడ్రంట్ (RLQ) అనేది మీ పక్కటెముకల దిగువ నుండి మీ జఘన జుట్టు వరకు నాలుగు వంతులుగా విభజించబడినటువంటి పొత్తికడుపు ప్రాంతం. మీ కుడి దిగువ క్వాడ్రంట్ అనేది మీ బొడ్డు క్రింద కలిగినటువంటి కుడి వైపున ఉన్న పావుభాగం.

లెఫ్ట్ లోయర్ క్వాడ్రంట్

మీ పక్కటెముకలు మరియు జఘన జుట్టు మధ్య నాలుగు భాగాలుగా కనిపించే పొత్తికడుపు యొక్క చతుర్భుజాలలో ఎడమ దిగువ క్వాడ్రంట్ ఒకటి. మీ ఎడమ దిగువ క్వాడ్రంట్ మీ బొడ్డు క్రింద మీ ఎడమ వైపున ఉన్నటువంటి పావుభాగం.

కడుపు నొప్పికి కారణాలు

పొత్తికడుపు నొప్పికి కొన్ని తరచుగా ఏర్పడే కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

మలబద్ధకం

కడుపు నొప్పితో మలబద్ధకం చాలా ప్రబలంగా ఉంటుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడటం లేదా ప్రేగు కదలికలు కష్టంగా ఉండటం వల్ల మలబద్ధకం ఏర్పడటానికి అత్యంత సాధారణ కారణంగా చెప్పవచ్చు. పొత్తికడుపులో నొప్పికి ముఖ్యమైన కారకాల్లో మలబద్ధకం ఒకటి.

మలబద్ధకం మీ పొత్తికడుపు అసౌకర్యానికి కారణమైతే, మీ పొత్తికడుపు అంతటా మీకు తీవ్రమైన గ్యాస్తో కూడిన నొప్పులు ఉండవచ్చు. మలబద్ధకం ఉన్న వ్యక్తులు తరచుగా పొట్ట ఉబ్బరంగాను మరియు నిండుగాను ఉన్నట్లు భావిస్తారు అంతేకాకుండా వారి పొత్తికడుపు కనిపించే విధంగా వాపును కూడా గమనించవచ్చు.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) అనునది పెద్ద ప్రేగులను ప్రభావితం చేసేటటువంటి రుగ్మత  మరియు పొత్తికడుపు నొప్పికి ఇది ఒక ప్రబలమైన పరిస్థితి. తిమ్మిరి, కడుపు నొప్పి, పొట్టలో ఉబ్బరం, గ్యాస్, అతిసారం లేదా మలబద్ధకం దీని యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలలో కొన్ని. IBS అనేది పొత్తికడుపు నొప్పి మరియు ప్రేగు నమూనాలలో మార్పుతో కూడిన దీర్ఘకాలిక పరిస్థితి.

ఆహార పదార్థాల ద్వారా ఏర్పడే అలెర్జీలు లేదా వాటిని శరీరం భరించలేక పోవటం

రోగనిరోధక వ్యవస్థ ఆహారంలోని కొన్ని ప్రోటీన్లకు ప్రతిస్పందించినప్పుడు ఆహారానికి  సంబందించిన అలెర్జీలు శరీరంలో అభివృద్ధి చెందుతాయి. ఆహార పదార్ధాల ద్వారా ఏర్పడే అలెర్జీలు తక్కువ స్థాయి నుండి తీవ్రమైన స్థాయి వరకు ఉంటాయి. ఇది అనాఫిలాక్సిస్ (anaphylaxis) అని పిలువబడే ప్రాణాంతక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది , ఇందులో ప్రాణాంతక శ్వాస సమస్యలు మరియు షాక్ వంటివి ఉంటాయి.

ఫుడ్ పాయిజనింగ్

ఫుడ్ పాయిజనింగ్ అనేది మీ శరీరానికి సరిపడని కొన్ని ఆహారాలను తీసుకున్న కొద్దిసేపటికే శరీరంలో జరిగేటటువంటి రోగనిరోధక ప్రతిచర్య. ఆహార పదార్ధాల ద్వారా ఏర్పడే అలెర్జీ తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది లేదా నిర్దిష్ట వ్యక్తులకు అనాఫిలాక్సిస్ అనే ప్రాణాంతక ప్రతిచర్యను కూడా కలిగిస్తుంది.

కడుపులో ఏర్పడే ఫ్లూ

వైరల్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ (Viral gastroenteritis) అనేది పేగులో సంభవించే ఇన్ఫెక్షన్, ఇది నీటితో కూడిన  విరేచనాలు అవ్వటం, కడుపులో నొప్పిగా ఉండటం లేదా తిమ్మిరి, వికారంగా అనిపించటం  లేదా వాంతులు అవ్వటం మరియు కొన్ని సందర్భాలల్లో జ్వరాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. వైరల్ గ్యాస్ట్రోఎంటెరైటిస్‌ను వివరించడానికి కడుపులో ఏర్పడే ఫ్లూ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కడుపు నొప్పి కడుపులో ఫ్లూ మరియు ఫుడ్ పాయిజనింగ్ రెండింటి వల్ల కూడా సంభవించవచ్చు.

ఋతుక్రమంలో ఏర్పడే తిమ్మిర్లు

మహిళల్లో పొత్తికడుపు నొప్పి అనేది మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య పరిస్థితి. ఇది ఋతుక్రమంలో ఏర్పడే తిమ్మిరి నుండి ప్రేగు సంబంధిత రుగ్మతల వరకు ఉంటుంది. ఇది అన్ని వయస్సుల వయోజన మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ దృగ్విషయం.

కడుపు నొప్పి యొక్క లక్షణాలు

తీవ్రమైన నొప్పి

మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, ఆహారపు అలెర్జీలు, పాలలోని లాక్టోస్ పడకపోవటం, ఫుడ్ పాయిజనింగ్ మరియు కడుపులో వైరస్ వంటి వాటి వలన పొత్తి కడుపులో ఏర్పడే తీవ్రమైన నొప్పి యొక్క కొన్ని గుర్తించదగిన లక్షణాలు.

జ్వరం

కడుపులో నొప్పి కారణంగా వచ్చే జ్వరం అనేది ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, ఇస్కీమిక్ కొలైటిస్ (ischemic colitis), ప్యాంక్రియాటైటిస్ (pancreatitis), పాలియార్టెరైటిస్ నోడోసా (PAN), ఫ్యామిలీ మెడిటరేనియన్ ఫీవర్ (FMF), పోర్ఫిరియా (porphyria) మరియు సికిల్ సెల్ క్రైసిస్ (sickle cell crisis) వంటివి నాన్-ఇన్ఫెక్షన్ డిజార్డర్స్ యొక్క లక్షణాలు.

రక్తస్రావంతో కూడిన మలం

మూలవ్యాధి (Hemorrhoids), ఆసన పగుళ్లు (anal fissures), ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి (IBD), అల్సర్లు మరియు పెద్దప్రేగు క్యాన్సర్ వంటి పరిస్థితులు రక్తస్రావంతో కూడిన మలాన్ని కలిగిస్తాయి. రక్తస్రావంతో కూడిన మలం సాధారణంగా టాయిలెట్ పేపర్‌పై, టాయిలెట్ బౌల్‌లోని నీటిలో లేదా మీ మలం మీద కనిపిస్తుంది.

నిరంతరంగా కొనసాగే వికారం మరియు వాంతులు

వికారం మరియు వాంతులు అనేవి దీర్ఘకాలికంగా లేదా సుదీర్ఘమైన పొట్ట సంబంధిత  సమస్యల యొక్క సాధారణ లక్షణాలు. వీటి యొక్క ఇతర లక్షణాలు అతిసారం, మలబద్ధకం మరియు కడుపు నొప్పి.

అతిగా తినడం, ప్రేగు సంబంధిత అంటువ్యాధులు, ఒత్తిడి మరియు ఆందోళనకు గురి కావటం మరియు నిరంతర జీర్ణశయాంతర వ్యాధులు వికారం మరియు వాంతులు ఇవి అన్నీ సంభావ్య కారణాలు.

సాధారణంగా వికారం మరియు కడుపు నొప్పి తాత్కాలికంగా ఉంటాయి మరియు వాటంతట అవే తగ్గిపోతాయి. మరోకవైపు, నిరంతర లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులు చికిత్స కోసం వైద్యుడిని తప్పకుండ సంప్రదించాలి.

బరువు తగ్గడం

బరువు తగ్గడం వల్ల కలిగేటటువంటి దీర్ఘకాలిక కడుపు నొప్పి ఒక ప్రమాదకరమైన వ్యాధి, దీనిని మీ వైద్యుడు వెంటనే గుర్తించి తప్పకుండా చికిత్స చేయాలి.

ఇన్ఫ్లుఎంజా లేదా జలుబు వంటి స్వల్పకాలిక వ్యాధుల వల్ల కూడా బరువు తగ్గవచ్చు, ఇది జీర్ణశయాంతర అసౌకర్యాన్ని ప్రేరేపిస్తుంది.

డిప్రెషన్, డయేరియా, నోటి పూతలు మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి ప్రమాదవశాత్తు బరువు తగ్గడానికి విలక్షణమైన కారణాలు కావచ్చు.

చర్మం పసుపు రంగులో కనిపిండం

కామెర్లు సాధారణంగా రక్తంలో బైలిరుబిన్ యొక్క శాతం అధిక పరిమాణంలో ఉన్నప్పుడు సంభవిస్తుంది, ఇది పసుపు రంగుతో కూడిన చర్మాన్ని కలిగి ఉండటం యొక్క అత్యంత ప్రబలమైన కారణం. పాతబడిన లేదా దెబ్బతిన్నటువంటి ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు, బైలిరుబిన్ ఉత్పత్తి ద్వారా పసుపు రంగు పదార్థం ఏర్పడుతుంది.

ప్యాంక్రియాటిక్ లేదా పిత్త వాహిక ప్రాణాంతకత ద్వారా ప్రేరేపించబడిన కామెర్లు యొక్క అత్యంత సాధారణ లక్షణం కడుపు నొప్పి. మీ కాలేయ వ్యాధి ఫలితంగా మీరు కామెర్లును  కూడా కలిగి ఉండవచ్చు.

మీరు మీ పొత్తికడుపును తాకినప్పుడు తీవ్రమైన సున్నితత్వాన్ని కలిగి ఉండటం

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవాలలో వాపు లేదా ఇతర తీవ్రమైన ప్రక్రియలు పొత్తి కడుపు సున్నితత్వానికి అత్యంత సాధారణమైన కారణాలు. సున్నితమైన ప్రాంతం చుట్టూ, అవయవాలు అన్నీ కలిసి సర్దుబాటు చేయబడతాయి.  

పొత్తికడుపు యొక్క వాపు

మీ పొట్ట ప్రాంతం సాధారణంగా ఉండటం కంటే పెద్దగా ఉన్నప్పుడు, మీకు ఉబ్బినట్టుగా కనిపించే పొత్తికడుపు ఉంటుంది. దీనిని పెద్ద పొట్ట లేదా పొడుచుకు వచ్చిన పొత్తికడుపు అని కూడా అంటారు. అసౌకర్యంగా లేదా బాధాకరంగా ఉన్నటువంటి ఉబ్బిన పొత్తికడుపు వాపుకు సాధారణమైన కారణాలలో ఒకటి. ఉబ్బిన పొత్తికడుపు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు మరియు ఇది చాలా సాధారణమైనది.

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వల్ల కడుపులో ఉబ్బరం, గుండెల్లో మంట, మలబద్ధకం మరియు ఋతుక్రమంలో తిమ్మిరి ఉబ్బినటువంటి పొత్తికడుపుకు సాధారణమైన  కారణాలు.

కడుపు నొప్పికి చికిత్సలు

ప్రేగు విశ్రాంతిని తీసుకోవటం

క్రోన్స్ & కోలిటిస్ ఫౌండేషన్ ప్రకారం, ప్రేగు విశ్రాంతి తీసుకోవటం అనేది మీ జీర్ణవ్యవస్థకు నోటి ద్వారా ఏది తీసుకోకుండా విశ్రాంతిని కలిగించటం. తినడం మానేయండం లేదా సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు లేదా అరటిపండ్లు వంటి వాటిని మాత్రమే తీసుకోవటం.

హైడ్రేషన్

డీహైడ్రేషన్ వల్ల తీవ్రమైన కడుపు నొప్పి రావచ్చు. ప్రజలకు తగినంత హైడ్రేషన్ గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలపై మొత్తం అవగాహనను కల్పించాలి.

మలం ఉత్పత్తి చేయడానికి తగినంత నీరు శరీరంలో లేనందున, డీహైడ్రేషన్ ఫలితంగా మలబద్ధకం అభివృద్ధి చెందుతుంది. ఇది కడుపులో తిమ్మిరి, పొట్ట ఉబ్బరం మరియు పొత్తికడుపులో నొప్పికి కారణం కావచ్చు. డీహైడ్రేషన్ అంటే తగినంత నీరు తాగకపోవడం మాత్రమే కాదు. మీరు డీహైడ్రేట్ అయినప్పుడు మీ శరీరంలో సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ గా లేకపోవటం.

హీట్ థెరపీ

మీకు కడుపులో నొప్పి ఉన్న చోట హీటింగ్ ప్యాడ్‌ను ఉంచడం ఒక సాధారణమైన పరిష్కారం. వేడి మీ బయటి పొట్ట కండరాలను సడలిస్తుంది మరియు జీర్ణ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. సాధారణంగా ఇలా ఉన్నప్పుడు పడుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవటం మంచిది. 15 నిమిషాలు, ఈ హీటింగ్ బాగ్ పొట్టపై ఉంచుకోవటం వల్ల కడుపులో నొప్పికి ఉపశమనాన్ని కలిగించవచ్చు.

కడుపునొప్పి నుండి ఉపశమనం పొందడానికి హీట్ కంప్రెస్ కూడా ఉపయోగించవచ్చు. మీ పొత్తికడుపు కండరాలను సడలించడానికి మరియు నొప్పిని తగ్గించడానికి వేడి నీటి బ్యాగ్ లేదా ఎలక్ట్రిక్ హీట్ ప్యాడ్ ఉపయోగించండం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని తాగడం వల్ల పొట్టలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇంటి నివారణ చర్యలు

హీటింగ్ ప్యాడ్ లేదా వెచ్చని గుడ్డతో మీ పొట్టని వేడి చేయండి. వేడి కండరాల యొక్క సడలింపు మరియు తిమ్మిరి ఉపశమనంలో సహాయపడుతుంది. మీ కడుపు నొప్పి నుండి ఉపశమనానికి ఎప్సమ్ సాల్ట్ లతో వేడి షవర్ లేదా స్నానం కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీకు కడుపు నొప్పి తగ్గకపోతే, అరటిపండ్లు, అన్నం, యాపిల్‌సాస్ మరియు టోస్ట్‌లతో కూడిన “BRAT” డైట్‌ని ప్రయత్నించండి. అదనంగా, మీరు పిప్పరమింట్, ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు అల్లం వంటి ఇతర ఆహారాలను కూడా ప్రయత్నించవచ్చు.

కడుపు నొప్పి యొక్క ప్రమాద కారకాలు

వయస్సులో పెద్ద వారు

డైవర్టికులిటిస్ (Diverticulitis) అనేది వృద్ధులలో ఏర్పడే కడుపు నొప్పికి ఒక సాధారణమైన కారణం. జాగ్రత్తగా ఎంపిక చేయబడిన రోగులలో నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్స్ ఉపయోగించి ఔట్ పేషెంట్ ఆధారంగా చికిత్స చేయవచ్చు. చిన్న మరియు పెద్ద ప్రేగులలో అడ్డంకులు ఏర్పడటం, ప్రధానంగా అంటు వ్యాదులు లేదా క్యాన్సర్ వల్ల వృద్ధులలో కడుపు నొప్పి సర్వసాధారణం మరియు తరచుగా శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.

మునుపటి పొత్తి కడుపు శస్త్రచికిత్స

మునుపటి పొత్తికడుపు శస్త్రచికిత్స (PAS) అనేది లాపరోస్కోపీ లేదా లాపరోటమీ ద్వారా చేసిన ఏదైనా మునుపటి పొత్తికడుపుకి సంబందించిన శస్త్రచికిత్సగా నిర్వచించబడింది. ఇది మేజర్ మరియు మైనర్ పూర్వపు పొత్తికడుపు శస్త్రచికిత్స అని రెండు వర్గాలుగా విభజించబడింది.

అర్ధరాత్రి తర్వాత, నీరు మరియు చూయింగ్ గమ్‌తో సహా ఏదైనా కూడా తినకూడదు లేదా త్రాగకూడదు. సూచించిన విధంగా మీరు మందులను తీసుకోవడం కొనసాగించవచ్చు, కానీ కేవలం నీరు మాత్రమే త్రాగాలి. మీ శస్త్రచికిత్సకు ఒక వారం ముందు, ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ లేదా ఏదైనా ఇతర ఆస్పిరిన్ గుణాలు కలిగిన ఔషధాలను తీసుకోకుండా ఉండండి.

ప్రేగు రుగ్మతల చరిత్రను కలిగి ఉండటం

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (Gastroesophageal reflux disease), క్యాన్సర్, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (irritable bowel syndrome), పాలల్లోని లాక్టోస్ పడక పోవటం మరియు హయాటల్ హెర్నియా ఇలాంటివి కొన్ని సాధారణ ప్రేగు రుగ్మతలు. అంతే కాకుండా, మీరు రక్తస్రావం, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, అతిసారం, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, వికారం మరియు వాంతులు వంటి ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.

పొట్ట వైరస్ కి గురికావటం

ఒక వ్యక్తి సాధారణంగా వైరస్లకు గురికాబడిన ప్రారంబం (మొదటి) నుండి 12 నుంచి 48 గంటలలోపు కడుపులో ఫ్లూని పొండటం జరుగుతుంది. వికారం, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, పొత్తికడుపులో తిమ్మిరి మరియు తక్కువ స్థాయి ఉష్ణోగ్రత వంటి లక్షణాల ఆధారంగా కడుపులో ఫ్లూ ఎక్కువభాగం నిర్ధారణ చేయబడుతుంది. వాంతులు మరియు విరేచనాలు వీటి స్వతహాగా లేదా ఏకకాలంలో సంభవించవచ్చు.

కడుపులో నొప్పి మరియు నివారణ చర్యలు

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

బియ్యం స్వచ్ఛమైనవిగా మరియు తెల్లగా ఉండేలా చూసుకోండి. నలుపు లేదా బ్రౌన్ రైస్ ముఖ్యంగా మీకు కడుపు నొప్పి ఉంటే జీర్ణం చేసుకోవటం కష్టతరం కావచ్చు. వైట్ రైస్ అనేది పిండి పదార్ధం, తక్కువ ఫైబర్ కలిగిన ఆహారం, ఇది మీ మలాన్ని దృడంగా చేయడానికి మరియు కొన్నిసార్లు కడుపులో ఏర్పడే సమస్యలతో పాటు వచ్చే విరేచనాలను ఆపడానికి కూడా సహాయపడుతుంది.

తక్కువ పరిమాణంలో భోజనం తీసుకోవటం

మినీ-మీల్స్ ఆకలిని అణిచివేసేందుకు, రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి మరియు రోజంతా విటమిన్లను అందించటానికి సహాయపడుతుంది. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం జీర్ణక్రియలో మీకు సహాయపడుతుంది మరియు పొత్తికడుపు నొప్పి బారిన పడకుండా చేస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

సాధారణంగా, కడుపులో ఏర్పడే అసౌకర్యాన్ని అత్యవసర సమస్యగా పరిగణించాలి. మీకు వచ్చిన నొప్పి అకస్మాత్తుగా మరియు తీవ్రంగా ఉంటే, లేదా అది వికారం మరియు వాంతులతో కలిపి ఉంటే, మీరు వెంటనే వైద్య సహాయం పొందాలి.

మీరు ఒక వారం కంటే ఎక్కువ కాలం పాటు కడుపులో నొప్పి, పొట్ట ఉబ్బరం మరియు అతిసారం వంటివి అనుభవిస్తూ ఉన్నట్లయితే లేదా 24 నుండి 48 గంటల్లో అది మెరుగుపడకపోతే, మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

సంక్షిప్తం

మీరు అనుభవించే కడుపు నొప్పిని తక్కువ అంచనా వేయకండి. పొత్తికడుపు నొప్పికి సంబంధించిన ఏవైనా ఇతర సంకేతాలు మరియు లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన భోజనం మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి. జంక్ ఫుడ్ తినడం మానేయండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

1. నా పొత్తి కడుపు నొప్పి యొక్క తీవ్రతను నేను ఎలా గుర్తించాలి ?

మీకు పదేపదే ప్రేగు కదలికలు లేదా కడుపులో నిరంతరమైన నొప్పి వంటి లక్షణాలు కలిగి ఉంటే, మీ పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి.

2. కడుపులో నొప్పి మరియు దానివల్ల కలిగే భాదకు అత్యంత ప్రబలమైన కారణం ఏమిటి?

కడుపులో ఏర్పడే నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. గ్యాస్ మరియు అజీర్ణం వల్ల ఏర్పడే నొప్పి, లేకపోతే  కండరాల వల్ల ఏర్పడే నొప్పులు వంటివి కొన్ని ప్రముఖ కారణాలుగా చెప్పవచ్చు.

3. పొత్తికడుపులో నొప్పికి కారణమేమిటో తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా?

ఫుడ్ పాయిసన్ అవ్వడం, మలబద్ధకం, ఆహార పదార్థాలు ద్వారా ఏర్పడే అలెర్జీలు, లాక్టోస్ పడక పోవటం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ మరియు కడుపులో ఏర్పడే వైరస్లు కడుపు నొప్పికి కొన్ని ముఖ్యమైన కారణాలుగా చెప్పవచ్చు.

DISCLAIMER: THIS BLOG/WEBSITE DOES NOT PROVIDE MEDICAL ADVICE

The Information including but not limited to text, graphics, images and other material contained on this blog are intended for education and awareness only. No material on this blog is intended to be a substitute for professional medical help including diagnosis or treatment. It is always advisable to consult medical professional before relying on the content. Neither the Author nor Star Health and Allied Insurance Co. Ltd accepts any responsibility for any potential risk to any visitor/reader.

;